ఎన్టీఆర్ పార్టీకి తెలుగుదేశం అని పెట్టడానికి.. వెనుక ఎస్వి రంగారావు సలహా ఉందా?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని ఎల్లలు దాటించినా ఎంతోమంది లెజెండరీ నటుల పేర్లు తీస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు ఎస్వీ రంగారావు..

 Sv Rangarao Behind Telugu Desham Party , Sv Rangarao ,telugu Desham Party,sr Ntr-TeluguStop.com

మొదటి తరం సినీ నటులలో ఈయన కూడా ఒకరు అని చెప్పాలి.కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలను కూడా చేస్తూ ఆయనకు తిరుగులేదు అని నిరూపించారు అని చెప్పాలి.

ఒకరకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలలో రారాజుగా వెలుగొందారు ఎస్.వి.రంగారావు.ఈయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నటుడు కావడం గమనార్హం.

 Sv Rangarao Behind Telugu Desham Party , Sv Rangarao ,telugu Desham Party,sr Ntr-TeluguStop.com

అయితే తెలుగులో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ ఎస్వీ రంగారావు ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ భాషలోనేనట.

అయితే ఎస్వీ రంగారావు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమర్థిస్తూ ఉండేవారట.

ఎలాంటి సమయంలో రాజకీయ చర్చలు వచ్చిన కాంగ్రెస్ ను గుడ్డిగా ఆయన సమర్థిస్తూ మాట్లాడుతూ ఉండేవారట.అయితే ఇలాంటి చర్చలు షూటింగ్లో సమయం కన్నా ధూమపానం చేసే సమయంలోనే ఎక్కువగా వచ్చేవట.

అయితే అన్నగారితో కూడా ఎస్వీ రంగారావు ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిపే వారట.ఇక అప్పుడు అన్న గారి దృష్టి మొత్తం కెరియర్ పైనే ఉంది.

అయితే అన్నగారు ఎక్కువగా ఎస్వీ రంగారావును కాఫీ కొట్టి ఆయనలాగా నటించడానికి ప్రయత్నం చేసేవారట.ఇక ఇది చూసిన రంగారావు కాంగ్రెస్ ను చూసి కాపీ కొట్టినట్టు ఉంటుంది అంటూ రాజకీయ పరిభాషలో చమత్కరించారట.

అంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ అని మిగతా పార్టీలు ఒక ఆ పార్టీని చూసి నేర్చుకుంటున్నాయన్న అర్థంతో ఆయన కామెంట్ చేశారు.నీ అంతట నువ్వు ఎదిగే ప్రయత్నం చేయమని రామారావుకు సలహా ఇచ్చారట.ఇది అన్నగారి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది.తద్వారా రామారావు రాజకీయాల్లోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ ను కాపీ కొట్టకుండా సొంతంగా టిడిపి పార్టీని స్థాపించి ఇక రాజకీయాలలో రాణించారు అనేది తెలుస్తుంది.

అయితే కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ ఎంతో మంది కొత్త పార్టీలు పెట్టిన ఇక తమ పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ అని ఉండేది.కానీ అన్న గారు మాత్రం కాంగ్రెస్ పేరు ఎక్కడా కనిపించకుండా వినిపించకుండా తెలుగుదేశం పార్టీ అని సరికొత్త టైటిల్ తో రాజకీయ పార్టీని స్థాపించారు.

Sv Rangarao Behind Telugu Desham Party , Sv Rangarao ,telugu Desham Party,sr Ntr ,joint West Godavari District, Congress Party, - Telugu Congress, Godavari, Sr Ntr, Sv Rangarao, Telugu Desham #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube