దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!

మన దేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు ( Devotees ) భగవంతుని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు.

 Do You Go To Temples With Bare Hands Details, Temples, Pooja , Temple Rituals, D-TeluguStop.com

అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయానికి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం ఆచరించి, సంప్రదాయ దుస్తులు ధరించాలని వేద పండితులు చెబుతున్నారు.

ఖరీదైన బట్టలు, ఫ్యాన్సీ నగలకు దూరంగా ఉండాలని కూడా చెబుతున్నారు.ఆలయానికి ( Temple ) వెళ్లే ముందు ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయడం ఎంతో మంచిది.

ఆ తర్వాత దేవాలయానికి వెళ్లే వెళ్లి పూజ ( Pooja ) చేయడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో అసలు వెళ్ళకూడదు.

అలాగే నూనె, కర్పూరం లేదా పువ్వులు తీసుకునీ వెళ్ళవచ్చు.

ప్రస్తుత రోజులలో చాలా ఆలయాల్లో నెయ్యి దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.దేవాలయంలోకి ప్రవేశించగానే దీప స్తంభం ముందు నిలబడి ప్రధాన విగ్రహాన్ని పూజ చేయడం మంచిది.అంతే కాకుండా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చుట్టు ప్రక్కల దేవతలను పూజించాలని పండితులు చెబుతున్నారు.

ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భ గుడిలోకి వెళ్లి ప్రార్ధనలు చేయడం ఎంతో మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే వినాయకుని దేవాలయానీకి వెళ్లినప్పుడు ఒక సారి ప్రదక్షిణ చేయడం, శివునికి ఆలయానికి వెళ్ళినప్పుడు మూడు సార్లు ప్రదక్షిణలు చేయడం,దేవతలకు మూడు సార్లు ప్రదక్షిణలు, విష్ణువు, దేవి దేవాలయాలకు వెళ్తే నాలుగు సార్లు ప్రదక్షిణలు చేయడం అసలు మర్చిపోకూడదని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube