బుగ్గ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో గురువారం చివరి రోజు స్వామివారి ఏకాంత సేవ కనుల పండుగ నిర్వహించారు.స్వామి ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించి దేవాలయ ఆవరణలో ఉయ్యాల్లో ఏకాంత ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాలలో దేవాలయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, సభ్యులు రాఘవేంద్ర రెడ్డి, రమేష్ హరిప్రసాద్, భగీరధమ్మ, లక్ష్మీదేవి, దేవాలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ పుణ్య కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కొటా ను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేయనున్నారు.ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు Tirupatibalaji.AP.Gov.in’ వెబ్సైట్ తో పాటు TT Devasthanams దేవ స్థానం మొబైల్ యాప్ లో కూడా ఈ కోటను విడుదల చేయనున్నారు.

ఇంకా చెప్పాలంటే ఏప్రిల్, మే, నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు కూడా శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.అలాగే మార్చి నెల కల్యాణోత్సవం,ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవా కోటాను కూడా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.కాబట్టి భక్తులు తిరుమల దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టోకెన్లను బుక్ చేసుకోవాలని, దళారుల చేతిలో మోసపోకూడదని దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.