జీవితంలో కొందరు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు.కానీ ఆర్థికంగా వృద్ధి సాధించలేరు.
అందుకు తమకు అదృష్టం లేకపోవడమే కారణమని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.అయితే కష్టపడుతూనే అప్పుడప్పుడు దైవాన్ని ఆరాధిస్తే జాతకంలో మార్పులు ఉండే అవకాశం ఉంది.
దీంతో అనుకున్నది సాధించడానికి బలం చేకూరుతుంది.అలాగే కొందరు ఇలా చేయడం వల్ల వారికి లక్ష్మీ( Lakshmi devi ) అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అయితే లక్ష్మీ కటాక్షం రావాలంటే పూజలు, యాగాలు కాకుండా మనస్ఫూర్తిగా దైవాన్ని కొలిస్తే సహకరిస్తారని చెబుతున్నారు.

ఈ తరుణంలో మనస్పూర్తిగా భగవంతుని కొలిస్తే ఒక్కోసారి దైవం కరుణించే అవకాశం ఉంది.మరి మనపై దైవం కరుణించాడని మనకు ఎలా తెలుస్తుంది.మన ఇళ్ళలో కొన్ని మార్పులు చూస్తూ ఉంటాం.
కానీ వాటిని అసలు పట్టించుకోము.కానీ ఇందులో అసలు విషయం ఉందని పండితులు చెబుతున్నారు.
వర్షాకాలం రాగానే ఎన్నో కీటకాలు ఇంట్లో చేరుతూ ఉంటాయి.ముఖ్యంగా నల్ల చీమలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
అయితే కొందరు ఇళ్లలో ఎప్పుడూ చూడని నల్ల చీమలు వారి ఇంట్లో కనిపిస్తాయి.వరసబెట్టి ఒక ప్రదేశానికి వెళుతూ ఉంటాయి.
ఇందుకు కారణం ఆ ఇంట్లో త్వరలో మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.

చీమలు( Black ants ) మాత్రమే కాకుండా మనం ఏదైనా అనుకున్నప్పుడు బల్లి పలికితే అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు.అయితే కొన్ని బల్లులు వరుసగా వస్తూ ఉంటాయి.వాటిని చూస్తే చికాకు గా అనిపిస్తూ ఉంటుంది.
ఒక బల్లిని మరో బల్లి వెంటాడుతూ ఉంటుంది.అలా బల్లులు పరుగులు తీస్తున్నాయి అంటే దాని అర్థం ఆ ఇంట్లో మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.
బల్లి సాధారణ సమయంలో కాకుండా దీపావలి రోజున తులసి చెట్టు వద్ద కనిపిస్తే ఇంకా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL







