భారతీయులను ఉబర్ డ్రైవర్లు, డెలివర్ పీపుల్ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా టీచర్‌పై( Australia Teacher ) అక్కడి సివిల్ ట్రిబ్యునల్ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.2021లో బిజినెస్ స్టడీస్ క్లాస్‌లో జేమ్స్ అండర్సన్( James Anderson ) అనే టీచర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.భారత సంతతికి చెందిన మాజీ విద్యార్ధిని ఫిర్యాదు మేరకు న్యూ సౌత్ వేల్స్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్పందించింది.విచారణ అనంతరం ఆమెకు అధికారికంగా క్షమాపణలు చెప్పాల్సిందిగా విద్యాశాఖను కోరినట్లు ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
క్రోనుల్లా హైస్కూల్‌కు( Cronulla High School ) చెందిన అండర్సన్ మార్చి 3, 2021న క్లాస్ కోసం 20 నిమిషాలకు పైగా నడిచే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ వీడియోను ప్లే చేశారు.ఇందులో భారత సంతతికి చెందిన ప్రెజెంటర్ వున్నారు.
ఈ సమయంలో భారతీయులందరూ ఉబెర్ డ్రైవర్లు,( Uber Drivers ) డెలివరి బాయ్స్,( Delivery Boys ) వారి సేవ చెడ్డది అంటూ ప్రెజెంటర్‌ను అండర్సన్ ఎగతాళి చేశారు.ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ స్పందనతో అసంతృప్తి చెందిన విద్యార్ధిని, ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్మాసనాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

వీడియో ప్లే అవుతుండగా.జేమ్స్ అండర్సన్ వెకిలిగా నవ్వుతూ తన వైపు చూశాడని విద్యార్ధిని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు.ఆ మహిళను, ఆమె ఉచ్చారణను చూసి ఎగతాళిగా నవ్వాడని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు ది హెరాల్డ్ పేర్కొంది.తాను భారతీయురాలినని( Indian ) తెలుసుకున్న అండర్సన్ తన వైపు చూస్తూ.
భారతీయ ప్రెజెంటర్‌ను వెక్కిరించినందుకు తాను ఎంతో బాధపడ్డానని విద్యార్ధిని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది తనకు ఇబ్బందికరంగా అనిపించిందని ఆమె చెప్పారు.

క్లాస్‌లోని మరో విద్యార్ధి వీడియోను ఆఫ్ చేయమని పదే పదే కోరినప్పటికీ అండర్సన్ వీడియోను ప్లే చేస్తూనే వున్నాడని విద్యార్ధిని వాంగ్మూలం ఇచ్చింది.ఆ సమయంలో తరగతిలోని విద్యార్ధులలో ఒకరిద్దరిలో తప్పించి ఎవ్వరూ బాధపడలేదని అండర్సన్ ధర్మసనం ముందు చెప్పాడు.దీనిపై ట్రిబ్యునల్ గత వారం తీర్పు వెలువరించింది.ఇది జాతి వివక్షేనని పేర్కొంటూ.అతనిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించింది.విద్యా శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.
ఎన్ఎస్‌డబ్ల్యూ ప్రభుత్వ పాఠశాలల్లో జాతి వివక్ష నిర్మూలనకు కట్టుబడి వున్నామన్నారు.







