1.ధాన్యం ఎలా ఉన్నా కొనాల్సిందే

ధాన్యం ఎలా ఉన్నా , ప్రతి ధాన్యపు గింజ కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ ( CM KCR )ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
2.సీబీఎస్సీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలను విడుదల చేశారు
3.కాంగ్రెస్ బిజెపిలపై విమర్శలు
కాంగ్రెస్ ,బిజెపి నాయకులు ఏం మాట్లాడుతారో వాళ్లకే తెలియదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
4.సింగపూర్ తరహాలో కరీంనగర్ అభివృద్ధి

త్వరలోనే సింగపూర్ తరహాలో కరీంనగర్ ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
5.తలసాని బిజెపి నేత రాజాసింగ్ ప్రశంసలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు.మంత్రి తలసాని చాలా బాగా పనిచేస్తున్నారని, అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని ప్రశంసించారు.
6.కెసిఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
7.ట్విట్టర్ సీఈవో గా లిండా యాకరీనో
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు ఎలన్ మాస్క్ గుడ్ బై చెప్పబోతున్నారు.ట్విట్టర్ కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా లెండ యాకరీనో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
8.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అమ్ముకోవద్దు
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎవరూ అమ్ముకోవద్దని ఒక్కో ఇల్లు కోటి రూపాయలు విలువ ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
9
.ఆనంద నిలయం ఘటనలో భద్రత వైఫల్యం
తిరుమలలో భద్రత వైఫల్యం బయటపడడంతో టీటీడీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఆనంద నిలయంలో నిబంధనలకు విరుద్ధంగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
10.కొండగట్టులో అంజన్న ఉత్సవాలు
కొండగట్టులో నేడు హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి.ఈనెల 15 వరకు వేడుకలు జరగబోతూ ఉండడం తో అధికారులు ఏర్పాటు పనుల్లో నిమగ్నం అయ్యారు.

11.తీవ్ర తుఫానుగా మారనున్న మోచ

మధ్య బంగాళాఖాతంలో మోచా తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
12.ఎమ్మెల్యే రాపాకకు ఊరట
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఊరట లభించింది.ఎమ్మెల్యే రాపాక ఎన్నిక ఫిర్యాదు పై కలెక్టర్ విచారణ పూర్తి చేశారు.
13.కావలి లో జగన్ పర్యటన
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు విజయవాడ, నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు.
14.అగ్ని వీరులకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
రైల్వే తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో అగ్ని వీరులకు నాన్ గెజిటెడ్ పోస్టులలో 15% సంచిత రిజర్వేషన్ ను అందిస్తుంది.
15.మధ్యప్రదేశ్ లో పట్టాలు తప్పిన గూడ్స్
మధ్యప్రదేశ్లోని కట్ని స్టేషన్ సమీపంలో సిమెంట్తో కూడిన గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వేగన్లు పట్టాలు తప్పయి.
16.పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) పొత్తుల పై చేసిన కామెంట్లకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు అవసరాల కోసం పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన అంటూ నాని విమర్శించారు.
17.చుక్కల భూముల రైతులకు సర్వహక్కులు
రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు.రిజిస్ట్రేషన్ లోని 22 ( a) నుంచి చుక్కల భూములను తొలగించామని తెలిపారు.
18.మంత్రి జోగి రమేష్ సవాల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ గా 175 స్థానాలు పోటీ చేయాలని ఏపీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.
19.చంద్రబాబు రైతు పోరుబాట

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పశ్చిమగోదావరి జిల్లాలో రైతు పోరుబాట పేరిట పాదయాత్ర చేపట్టారు.అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రైతుల తరఫున ప్రభుత్వంపై పోరుబాట పేరిట తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు.
20.మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజ్ సభ్యుల ఆస్తుల అటాచ్
మనీ లాండరింగ్ కేసులో ఏపీ తెలంగాణలోని భూములు భవనాలను ఈడి అటాచ్ చేసింది.
మంగళగిరి ఎన్నారై కాలేజ్ సభ్యుల ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ మణి అక్కినేని కి చెందిన 37 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్ చేసింది.