మురళి మోహన్ గారి 5 కిలోల బరువు మాటలకు స్పందించిన పవన్...! హైలైట్ కౌంటర్.!

తొమ్మిది రోజులుగా టీడీపీ ఎంపీ (రాజ్యసభ) సీఎం రమేష్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆయన నిరాహార దీక్ష చేస్తోంటే, ఆ నిరాహార దీక్షని ఇంకెవరో కాదు.

 Pawan Kalyan Ilight Counter To Murali Mohan-TeluguStop.com

టీడీపీ ఎంపీలే అవహేళన చేస్తున్నారాయె.సాక్ష్యం కావాలా.? ఇదిగో ఓ వీడియో.అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు, టీడీపీ ఎంపీల తీరుని కడిగి పారేస్తుండడం గమనార్హం.

‘ఐదు రోజుల నిరాహార దీక్షకు నేను రెడీ.ఎందుకంటే, నేను ఐదు కిలోల బరువు తగ్గాలనుకుంటున్నాను.’ అంటూ రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌ నిరాహార దీక్షను ఓ రేంజ్‌లో అపహాస్యం చేశారు.మరోపక్క, ఇటీవల విశాఖ రైల్వే జోన్‌ కోసం నిరాహార దీక్ష చేసిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌, ‘జోనూ లేదు, గీనూ లేదు.

నిరాహార దీక్షల్ని లెక్కచేసెదెవరు?’ అనేశారు.

‘ఈయన్ని పెడదాం డాన్‌.మొదటి రోజైతే రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్దాం.’ అని జేసీ దివాకర్‌రెడ్డి అంటే, ఆ వెంటనే ‘ఆయన్నెందుకు.?’ అంటూ మరో ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అన్నారు.వీడియో చూస్తే, అందులోని ఆడియో వింటే ఎవరికైనా మతి పోవాల్సిందే.

ఆ స్థాయిలో నిరాహార దీక్షల్ని టీడీపీ ఎంపీలు ‘కామెడీ’ చేసేశారు మరి.

తమ సంభాషణల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు.ఈ వీడియో మార్ఫింగ్‌ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు.

తమ మాటలను మార్ఫింగ్‌ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.

సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు.ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆ పాయింట్‌ని పార్టీలోప‌లి వాళ్లు జీర్ణించుకోలేని ప‌రిస్థితిలో ఉంటే ఆపోజిష‌న్ పార్టీలు… వాళ్ల మీడియా సంస్థ‌లు పండ‌గ చేసుకుంటున్నాయి.ఎందుకు చేసుకోరు ఆపోజిట్ టీమ్ సెల్ఫ్ గోల్ కొడితే వ‌చ్చిన పాయింట్ ని ఎంజాయ్ చేయాలి క‌దా అని వాళ్ల ఫీలింగ్‌.

అదే స‌మ‌యంలో భ‌విష్య‌త్తులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని స్థానాల నుంచి పోటీ చేయ‌డానికి సిద్ధం అయిన జ‌న‌సేన పార్టీకి చెందిన‌ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోపై యాక్టివ్‌గా స్పందిస్తున్నారు.కొంత స‌మ‌యం క్రిత‌మే.

జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాన్ కూడా ఈ విష‌యంపై స్పందించారు.ఒక ర‌కంగా నిల‌దీశారు అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube