అవును! విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదేఅంశంపై చర్చ నడుస్తోం ది.ఆయనలో నాయకత్వ లక్షాలు ఉండి ఉంటే.
ఆయననే సొంత అన్నయ్యగా భావించిన వారు, ఆయననే తమ నేతగా అంగీకరించిన వారు పార్టీ నుంచి బయటకు ఎందుక వస్తారు? అనేది ప్రధాన ప్రశ్నగా మారిపోయింది.దాడి వీరభద్రరావు వంటివారు ఫ్యామిలీతో సహా వెళ్లి వైసీపీలో చేరారు.
అయితే, కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన పార్టీకి రాం రాం చెప్పారు.
ఇక, వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి గెలిచిన వెంటనే కనీసం జగన్ మొహం కూడా చూడకుండా పార్టీని విడిచి పెట్టారు.ఇక, పార్టీలోకి వెళ్లిన ఉత్తరాంధ్రలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు కొణతాల రామకృష్ణ ఈయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.అదేవిధంగా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి పెట్టారు.
ఎంపీ బుట్టా రేణుక జగన్ నియంతృత్వాన్నిభ రించలేక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.కొత్తపల్లి గీత అరకు నుంచి వైసీపీ జెండాపై గెలిచి కూడా పార్టీ కార్యాలయం గడప తొక్కలేదు.
ఇక, ఇప్పుడు కూడా ఎంతో మంది నేతలు జగన్ వైఖరి తమను ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.జగన్ విధానాలు నచ్చకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని మంత్రులు అమర్‌నాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పలుమార్లు వెల్లడించారు.
ఇక, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా గుంభనంగా నెట్టుకొస్తున్నా.ఆయనకు కూడా జగన్ వైఖరిపై సానుకూల దృక్ఫథం కనిపించడం లేదు.వెరసి ఇవన్నీ.పార్టీలో ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
మరో పదిమాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి వీరంతా గళం వినిపించేందుకు ముందుకు వస్తున్నారు.జగన్‌లో పార్టీని నడిపించే నాయకత్వమే లేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని జగన్ చూస్తున్నాడు తప్పితే.ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం కాదనేది వారి మాట.
తనపై ఉన్నకేసులను మాఫీ చేసుకునేందుకు, తన వారిని, తన ఆస్తులను రక్షించుకునేందుకు మాత్రమే జగన్ అధికారం కోసం వెంపర్లాడుతున్నారని అంటున్నారు.
ఈ పరిణామం జగన్‌ను తీవ్రంగా ఇరకాటంలోకి నెడుతున్న ప్రధాన విషయం.
మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో చూడాలి.ఏదేమైనా.
జగన్‌లో నాయకత్వ లక్షణాల విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చసాగడం నిజంగా ఆయనకు మైనస్‌గానే భావించాల్సి ఉంటుంది.