Hair Growth Tonic : పల్చటి జుట్టుతో బాధపడే పురుషులకు బెస్ట్ హెయిర్ గ్రోత్ టానిక్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన చాలు!

అధిక ఒత్తిడి, గంటలు తరబడి కంప్యూటర్ ముందు కుస్తీ పడటం, పోషకాహారం తీసుకోకపోవడం, ధూమపానం మద్యపానం వంటి చెడు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాల వల్ల చాలా మంది పురుషుల్లో జుట్టు పల్చబడి పోతూ ఉంటుంది.

ఈ సమస్యను పురుషులు ఎంతో సీరియస్ గా తీసుకుంటారు.

అందులోనూ పెళ్లి కాని వారైతే ఇంకా ఎక్కువ మదన పడుతూ ఉంటారు.జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ గ్రోత్ టానిక్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడిన చాలు కొద్ది రోజుల్లోనే మీ జుట్టు భారీగా పెరుగుతుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయ( Onion ) మరియు అంగుళం అల్లం ముక్క తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం ముక్కలు వేసుకోవాలి.మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ టానిక్ సిద్ధం అవుతుంది.ఇప్పుడు ఈ టానిక్ ను స్కాల్ప్ కు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

మసాజ్ పూర్తయిన 40 నిమిషాల తర్వాత తేలిక పాటి షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి పురుషులు ఈ టానిక్ ను వాడితే కనుక హెయిర్ ఫాల్ సమస్య( Hair fall )ను సులభంగా వదిలించుకోవచ్చు.ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు మరియు ఆలివ్ ఆయిల్ లో ఉండే పోషకాలు జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!

కురులు ఎంత పల్చగా ఉన్నా సరే ఈ టానిక్ ను వాడటం ప్రారంభించారంటే కొద్దిరోజుల్లోనే దట్టంగా మారతాయి.కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడే పురుషులు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను ట్రై చేయండి.

Advertisement

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు