పొద్దున షూటింగ్ చేసి ప్రతాప్ తో మధ్యాహ్నం రాధిక పెళ్లి.. ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి పెద్ద

Radhika, Prathap Marriage Stroy , Radhika, Prathap Marriage, Actress Sri Priya, Pratap Potan, Heroines, Atluri Purnachandra Rao, Shobhan Babu , Tollywood

చిత్ర పరిశ్రమలో నటినటుల మధ్య స్నేహం ఏర్పడడం అనేది చాలా తక్కువ అందులో హీరోయిన్స్ మధ్యల స్నేహం ఉండడం అనేది చాలా అరుదు.ఏదైనా ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారంటే చాలు వారి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి.

 Radhika, Prathap Marriage Stroy , Radhika, Prathap Marriage, Actress Sri Priya,-TeluguStop.com

అలాగే ఒక హీరోయిన్ ఎక్కువ హిట్స్ కొడుతున్న ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న మిగతా హీరోయిన్లకి చాలా అసూయ ఉంటుంది అందుకే హీరోయిన్స్ కి అసలు పోసగదు.కానీ హీరోయిన్ రాధిక, సరిత ఇద్దరు ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చారు అంతే గొప్పగా వీరిద్దరి మధ్య స్నేహం కూడా ఉండేదట.

ఈ స్నేహం సినిమాల సమయంలో మొదలైంది కాదు కెరియర్ మొదట్లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.ఆ స్నేహం సినిమాలతో పాటు క్రమంగా బలపడుతూ వచ్చింది ఎంతలా అంటే ఒకరి పెళ్లిళ్లు ఒకరు చేసేంత దగ్గరగా వారి బంధం కొనసాగింది.

రాధిక, ప్రతాప్ పోతన్ ల వివాహం గురించి మనందరికీ తెలిసిందే.తాజాగా ప్రతాప్ కన్ను మూయడంతో రాధిక సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

వీరి వివాహ సమయంలో సరిత వీరి పెళ్లికి పెద్దగా వ్యవహరించాలని వార్త సైతం ప్రస్తుతం సంచలనంగా మారింది.పెళ్లి చేసుకున్న ఏడాదికే వీరు విడిపోయిన సంగతి పక్కన పెడితే, సరిత మాత్రం రాధిక కు సంబంధించిన అన్ని పరిస్థితులలోనూ, అన్ని క్లిష్ట సమయాలలోనూ తన వెంటే నిలబడింది.

ఎన్నోసార్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని సతమతమవుతున్న సమయంలో రాధికకు సరిత అండగా ఉండేదట.అందుకే సరిత, స్నేహం నేటి వరకు కొనసాగుతూనే ఉంది ఇక పెళ్లి సమయంలో పెళ్లి బట్టల దగ్గర నుంచి మంగళసూత్రం వరకు అన్ని కూడా రాధిక కోసం సరితనే షాపింగ్ చేసిందట.

రాధిక ఇప్పుడు అంటే చాలా డైనమిక్ లేడీ కానీ మొదట్లో అన్నిటికి కంగారు ఎక్కువగా ఉండేది.అంతేకాదు తొందరగా ఎక్కువగా కలవర పాటుకు గురయ్యేది.కారణమేంటో తెలియదు కానీ రాధికకు భయం కూడా ఎక్కువే అప్పట్లో.అందుకే రాధిక కు సరిత ఎప్పుడు పక్కనే ఉండేది, ఎక్కువ ఉత్సాహపరిచేది.

Telugu Pratap Potan, Prathap Pothan, Prathap, Prathap Stroy, Radhika, Saritha, S

రాధిక, సరితలకు మరొక స్నేహితురాలు కూడా ఉంది ఆమె నటి శ్రీ ప్రియ.రాధిక ఉన్నపలంగా గా తీసుకున్న ఈ నిర్ణయం ఈ నిర్ణయం గురించి శ్రీ ప్రియకు తెలియజేయాలని సరిత, రాధిక చాలా ప్రయత్నించారట కానీ ఆమె అవుట్డోర్ షూటింగ్ లో ఉండడంతో అది కుదరలేదు.రాధిక కు కూడా నిజానికి ఆమె పెళ్లి రోజు షూటింగ్ కూడా ఉంది.ముగ్గురు మొనగాళ్లు అనే సినిమా అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాతగా ఉండగా శోభన్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రంలో రాధిక హీరోయిన్ గా నటిస్తుంది.

షూటింగ్ పెట్టుకొని ఉదయం పెళ్లి నిర్ణయం తీసుకుంది రాధిక.దాంతో నిర్మాత షాక్ కి గురయ్యారు.ఇక పెళ్లిరోజు షూటింగ్ పూర్తి చేసుకుని సరిత రాధికలు కలిసి వెళ్ళి పెళ్లి తంతు పూర్తి చేశారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube