బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎందుకు వస్తుంది.. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది బ్రెయిన్ స్ట్రోక్( Brain Stroke ) కారణంగా మరణిస్తున్నారని వార్తలు చదువుతూనే ఉన్నాం.ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 Know These Early Signs Of Brain Stroke Details, Brain Stroke, Brain Stroke Sympt-TeluguStop.com

ఈ సమస్య రాకముందే దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితి నుంచి బయటపడవచ్చు.ఇంతకీ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది.

దీనికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు కణాలకు ఆక్సిజన్( Oxygen ) ఎంతో అవసరం.

ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది.మెదడు కణాలకు( Brain Cells ) రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్ ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

అయితే కొన్నిసార్లు సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి త్వరగా బయటపడవచ్చు అని వైద్యనిపుణులు చెబుతున్నారు.బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇలా ఉంటాయి.

ఏ రకమైన స్ట్రోక్ వచ్చిన ముందుగా తలనొప్పి( Headache ) వస్తుంది.హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.

కరోటిడ్ ఆర్టరీ నుంచి స్ట్రోక్ మొదలవుతుంది.ఈ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

ముఖం ఒకవైపుకు వంగిపోవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం, ఒక చెయ్యి తిమ్మిరి బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని ముఖ్య లక్షణాలు.

Telugu Pressure, Brain, Brain Stroke, Brainstroke, Problems, Chest Pain, Diabete

అలాగే శ్వాసలో సమస్యలు( Breathing Problems ) ఏర్పడవచ్చు.చాతినొప్పి,( Chest Pain ) శ్వాసలో సమస్యలు వస్తూ ఉంటాయి.ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి.

ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.ఒక సర్వే ప్రకారం 10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయని గుర్తించారు.

అలాగే మహిళలలో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Telugu Pressure, Brain, Brain Stroke, Brainstroke, Problems, Chest Pain, Diabete

అలాగే ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు జరుగుతూ ఉంటాయి.అంతేకాకుండా వికారం, వాంతులు( Vomtings ) మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు వికారంగా ఉండడం వంటివి కనిపిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే బ్రెయిన్ స్ట్రోక్ గల కారణాలు అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం వీటితోపాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె సంబంధిత సమస్యలు వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు.

ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube