తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచితనానికి మారుపేరుకు నిలవెత్తు నిదర్శనం అయిన హీరోలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ఒకరు.ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ( Krishnam Raju ) వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు.
ఇలా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ కలిగి ఉన్నటువంటి ప్రభాస్ ల పట్ల ఒక హీరో చాలా అవమానకరంగా ప్రవర్తించారని తెలుస్తుంది.
ప్రభాస్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యి పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ప్రభాస్ కి పెద్దగా క్రేజ్ లేదని ఆయనని సినిమా నుంచి తీసేసారట.

ఇలా ప్రభాస్ తో సినిమా కమిట్ అయ్యే ప్రభాస్ ను సినిమా నుంచి తప్పించినటువంటి డైరెక్టర్ ఎవరు ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే… ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ( Gautham Vasudev Menon ) దర్శకత్వంలో వెంకటేష్( Venkatesh ) ఆసిన్ ( Asin )హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఘర్షణ ( Garshana ).ఇందులో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించక స్కూల్ టీచర్ పాత్రలో ఆసిన్ కనిపించారు.అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కాదని ప్రభాస్ అని తెలుస్తోంది.
ఈ సినిమాకు హీరో ప్రభాస్ అని కమిట్ అయిన అనంతరం పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారట.

అయితే పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయానికి ప్రభాస్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఆయనతో ఇలాంటి సినిమా చూస్తే సినిమాకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతో గౌతమ్ మీనన్ ప్రభాస్ స్థానంలో హీరో వెంకటేష్ ను తీసుకున్నారు.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ కి క్రేజ్ లేదని ఈ సినిమా నుంచి తప్పించిన డైరెక్టర్ ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా పిలవడం విశేషం.
అయితే తనని ఈ సినిమా నుంచి తప్పించారన్న విషయాన్ని మనసులో ఏమాత్రం ఉంచుకోకుండా ప్రభాస్ ఈ సినిమా వేడుకకు హాజరై సందడి చేశారు.