మనలో చాలామంది పాదాలు నులివెచ్చలుగా ఉంటాయి.కానీ కొంతమంది పాదాలు మాత్రం మంచు ముక్కల్లాగ చల్లగా ఉంటాయి.
ఇక సాక్స్ వేసుకొని షూస్ ధరించే బాధ అయితే అనేకం.తీవ్రమైన దుర్వాసనతో నిండిపోతాయి.
ఓ రకంగా వారికి షూస్ ధరించాలంటే భయం… కానీ తప్పదు.అలాంటివారు నడుస్తుంటే తడి పాదాల అచ్చుముద్రలు నేలపైన పడుతూ ఉంటాయి.
అయితే అలాంటివారికి ఆరోగ్య నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.చల్లని పాదాలు రక్తప్రసరణ సరిగా జరగకపోవడానికి సంకేతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారు అలా జరగడానికి అనేక కారణాలు తెలుపుతున్నారు.ఓ వ్యక్తోలో ఆటో ఇమ్యూన్ పరిస్థితులు బాగా లేకున్నా, మధుమేహం వంటి సమస్య వున్నా, రక్తహీనత, గుండె జబ్బులు, ధమనుల్లో బ్లాకేజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల కాళ్ళు, పాదాలకు రక్తప్రవాహం మందగించే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.ఇలా ఇలాంటివారిని రేనాడ్ ఫినామినన్ అనే వ్యాధి వెంబడించొచ్చు అని కూడా హెచ్చరిస్తున్నారు.అలాగే హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పాదాలు చల్లబడతాయి అని చెబుతున్నారు.

అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముందుగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఒకవేళ మీకు అలాంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.ఇలాంటివారు ప్రతిరోజు కనీసం 30-45 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని చెబుతున్నారు.అలాగే సమతుల్య ఆహారం తీసుకోవాలి.అంతేకాకుండా రక్తప్రసరణ మెరుగు పరిచే విధంగా కాళ్ళని కదిలించాలి.ఎక్కువగా నీరు తాగాలి అని సూచిస్తున్నారు.







