ఢిల్లీలో 49వ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ముగిసింది.ఈ సమావేశంలో స్టేషనరీ వస్తువులపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
ఫలితంగా స్టేషనరీ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.స్టేషనరీ అంటే పెన్నులు, పెన్సిళ్లు, పేపర్లు, షార్ప్‌నర్లు, డెస్క్ ఆర్గనైజర్లు, పేపర్ క్లిప్‌లు, ఇంకా తదితర వస్తువుల ప్రైస్ తగ్గనున్నాయి.
దీనివల్ల విద్యార్థులకు చాలా భారం తగ్గుతుందని చెప్పవచ్చు.

అంతేకాకుండా కంటైనర్లకు అతికించే ట్యాగ్‌లు, ట్రాకింగ్ డివైజ్‌లు, డేటా లాగర్లపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని సున్నా శాతానికి తగ్గించి తీపి కబురు అందించారు.అలానే బెల్లం పాకంపై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించారు.ఉత్తరప్రదేశ్, ఇతర బెల్లం ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు బెల్లం పాకంపై కూడా జీఎస్టీ 18% నుంచి వదులుగా ఉంటే సున్నాకి.
ముందుగా ప్యాక్ చేసి ‘రాబ్’ అని లేబుల్ చేయబడి ఉంటే 5%కి తగ్గించడం జరిగింది.

గడువు తేదీ ముగిసిన తర్వాత వార్షిక జీఎస్‌టి రిటర్న్‌లను దాఖలు చేసినప్పుడు విధించే లేట్ ఫీజును రేషనలైజ్ చేయాలని జీఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించింది.ఇకపోతే ఇదే సమావేశంలో రాష్ట్రాలకు జూన్‌లో రూ.16,982 కోట్లతో సహా మొత్తం పెండింగ్‌లో ఉన్న GST పరిహారం చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.కాగా పరిహార బకాయిల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.689 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.548 కోట్లు వస్తాయి
.






