మహారాష్ట్రలో మహా దారుణం.. పెళ్లి చేసుకోమన్న మహిళపట్ల కిరాతకం.. ?  

Maharashtra, atrocity, man kills, girl friend - Telugu Atrocity, Girl Friend, Maharashtra, Man Kills

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఆపడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలను రూపొందిస్తున్న ఆ నేరాలు ఆగడం లేదు.నమ్మకంతో వంచన చేసి కౄరంగా హతమారుస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

TeluguStop.com - Atrocity In Maharashtra Man Kills Girl Friend

ఇలాంటి దాడులు ఆడ మగ అనే భేధం లేకుండా జరుగుతున్నాయి.

కొన్ని హత్యలు ప్రేమ పేరుతో జరుగుతుండగా మరి కొన్ని అక్రమ సంబంధాల వల్ల లేదా క్షణికమైన ఆవేశాల వల్ల జరుగుతున్నాయి.

ఇలాంటి దారుణమైన సంఘటన ఒకటి మహారాష్ట్ర పాల్ గఢ్ జిల్లా వనగామ్ లో వెలుగు చూసింది.

తనతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న 32 సంవత్సరాల మహిళను హత్య చేసి ఆమె మృత దేహాన్ని గోడలో దాచిన వైనం నేరస్దుల కౄర మనస్తత్వానికి అద్దం పడుతుంది.

కేవలం ఆ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కోరినంత మాత్రానే ఆమెను చంపానని ఆ వ్యక్తి చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి లోను చేసిందట.

ఇక మరణించిన మహిళ బంధులు ఆమె కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించడం వల్ల ఈ దారుణం బయటకు పొక్కింది.

మహిళ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పడంతో ఆ మృతదేహాన్ని దాచిన గోడను పగల గొట్టగా మరణించిన మహిళ అస్థిపంజరం బయటపడింది.దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారట.

#Maharashtra #Man Kills #Girl Friend #Atrocity

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు