స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాలీవుడ్ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటికే పూర్తి చేశారు.
మహేష్ హీరోగా తర్వాత సినిమా తెరకెక్కాల్సి ఉన్నా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా పూర్తైతే మాత్రమే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.అయితే ఆరు నెలల గ్యాప్ లో ఒక చిన్న సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం.
బాలీవుడ్ యాక్టర్లతో రాజమౌళి చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే రాజమౌళి నుంచి అధికారికంగా ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజమేంటో అబద్ధమేంటో తెలుస్తుంది.
తక్కువ సమయంలో ప్రయోగాత్మక సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచే ఈ ప్రచారం జరుగుతుండటంతో చాలామంది ఈ ప్రచారం నిజమేనని నమ్ముతున్నారు.
నెల రోజులలోనే రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి మరో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ప్రమోషన్స్ చేసి రాజమౌళి సినిమాను రిలీజ్ చేయనున్నట్టు వినిపిస్తోంది.అయితే రాజమౌళి వేగంగా సినిమాలను తీయలేరని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.
గతంలో రాజమౌళి చిన్న సినిమాగా ఈగ సినిమాను మొదలుపెట్టారు.

అయితే ఈగ మూవీ ఆ తర్వాత భారీ బడ్జెట్ మూవీగా మారి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.రాజమౌళి దర్శకత్వం వహిస్తానంటే వందల కోట్లు ఖర్చు చేయడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.రాజమౌళి మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన జక్కన్న ప్రమోషన్స్ ను కూడా ఆపేశారని తెలుస్తోంది.ఈ సినిమా నుంచి దోస్తీ సాంగ్ రిలీజై నెల రోజులైనా మరో సాంగ్ రిలీజ్ కాలేదు.