కెనడా ప్రభుత్వం తమ దేశ అభివృద్ధి లో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వలసలను గడిచిన కొన్ని ఏళ్ళుగా ప్రోశ్చహిస్తూ వస్తోంది.అత్యధిక శాతం మంది భారతీయ నిపుణులు, విద్యార్ధులు అమెరికా వైపు చూడటంతో వారిని ఆకర్షించే క్రమంలో కెనడా తమ వలస విధానంలో కీలక మార్పులు చేస్తూ వచ్చింది.
ఇదిలాఉంటే కరోన ఆంక్షల నేపధ్యంలో అమెరికా వలస వాసుల ఎంట్రీ కి బ్రేకులు వేసిన సమయంలో కెనడా భారతీయులకు ఆకర్షిస్తూ ఆకర్షణీయ పధకాలు ప్రవేశ పెట్టింది.ముఖ్యంగా టెకీ లు, విద్యార్ధులే టార్గెట్ గా కొత్త వలస విధానాన్ని రూపొందించింది.
దాంతోఅమెరికా వెళ్ళే భారతీయ నిపుణులు, విద్యార్ధులు కెనడా వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు.పెద్ద ఎత్తున కెనడా కు భారత్ నుంచీ దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి.
అంతేకాదు కెనడా కూడా ఎలాంటి అలాస్యం చేయకుండా వీసా ప్రాసెసింగ్ ఎంతో వేగంగా జరిపి భారతీయులను కెనడా ఆహ్వానించింది.ఈ క్రమంలోనే మరింత మంది నిపుణులకు ఆహ్వానించే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కెనడా ప్రభుత్వం.

తమ దేశంలో ఉంటున్న వలస వాసులకు శాశ్వత హోదా కల్పించేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తోందట.ఇందులో భాగంగా 2022 -23 ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 3 లక్షల మంది వలస వాసులకు శాశ్వత హోదా కల్పించాలని భావిస్తోందట.ఈ విషయాన్ని అక్కడి మీడియా సైతం వెల్లడించింది.స్థానిక మీడియా కధనాల ప్రకారం 2023 ఏడాదికి గాను పెండింగ్ లో ఉన్న 2.85 లక్షల వీసా దరఖాస్తులను పరిశీలిస్తూనే దాదాపు 3 లక్షల మందికి శాశ్వత పౌరసత్వం అందిస్తోందట.ఇదిలాఉంటే కెనడా ఇచ్చే ఈ 3 లక్షల శాశ్వత హోదా లో అత్యధికంగా లాభపడేది భారతీయులేనట.
కెనడా కు వలస వెళ్ళిన వారికి అగ్ర భాగం భారతీయులే ఉన్నారని 2021 -22 లో కెనడా కు వలసలు వెళ్ళిన వారిలో సింహ భాగం భారతీయులదేనని అంటున్నారు పరిశీలకులు.
.






