జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కె.వి రూపొందించిన సినిమా ప్రిన్స్.
ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్, మారియా రబోషప్క కీలకపాత్రలో నటించారు.కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా రూపొందగా.
ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, డి సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా చేశారు.మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫిని అందించాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ప్రేక్షకులకు భారీ అంచనాలు వెలువడ్డాయి.
పైగా జాతి రత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందించిన అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.ప్రేక్షకులలో మరింత ఆసక్తి కలిగింది.
అయితే ఈ సినిమా ఈరోజు తెలుగు, తమిళ భాషలో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.పైగా స్టార్ హీరోతో దర్శకత్వ వహించిన అనుదీప్ కు ఈ సినిమా ఎటువంటి మార్కులు ఇచ్చిందో.అంతేకాకుండా స్టార్ హీరో శివ కార్తికేయన్ కు ఎటువంటి టాక్ వచ్చిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో శివ కార్తికేయన్ ఒక స్కూల్ టీచర్.ఇక తను చెప్పే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న మారియా రబోషప్క ను చూసి ఇష్టపడతాడు.
ఇక ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా పాట్లు పడతాడు.ఇక తనను పెళ్లి చేసుకునే క్రమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాడు.ఇంతకు ఆ సమస్యలు ఏంటి.తను ఇష్టపడ్డ ప్రేయసిని చివరికి పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
శివ కార్తికేయన్ తన నటనతో బాగా అదరగొట్టాడు.టీచరుగా తన పర్ఫామెన్స్ అద్భుతంగా చూపించాడు.ప్రేమ కోసం తపన పడే అబ్బాయిగా బాగా అలరించాడు.
హీరోయిన్ కూడా పర్వాలేదు అన్నట్లుగా కనిపించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రకు న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా డైరెక్టర్ రొటీన్ కథ అందించాడని చెప్పవచ్చు.ఇక సంగీతం పరవాలేదు అన్నట్లుగా ఉంది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.
మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగా పని చేశాయి.

విశ్లేషణ:
డైరెక్టర్ అనుదీప్ రొటీన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చాడు.కాస్త కొత్తదనంతో చూపించే ప్రయత్నం చేశాడు.కానీ అంతగా చూపించలేకపోయాడు అన్నట్లుగా అనిపించింది.ఇక మాస్ మైనరిజం, రొమాంటిక్ సన్నివేశాలను బాగా చూపించారు.
ప్లస్ పాయింట్స్:
శివ కార్తికేయన్ నటన, మాస్ మేనరిజం, రొమాంటిక్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్.

మైనస్ పాయింట్స్:
సంగీతంలో మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.కొన్ని కొన్ని సీన్లలో జాగ్రత్త పడితే బాగుండేది.కామెడీ అంత వర్కౌట్ కాలేదు అన్నట్లుగా ఉంది.
బాటమ్ లైన్:
రొటీన్ కథగా అనిపించిన కూడా కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉంది.కానీ కామెడీ మాత్రం అంతగా కనిపించలేదు.







