మళ్లీ పెళ్లిళ్ల సీజన్( Wedding Season ) రానే వస్తోంది.ఎంతో మంది పెళ్లి పీటలెక్కబోతున్నారు.
అయితే తమ పెళ్ళిలో ప్రతి వధువుకి తాను ఎంతో అందంగా కనిపించాలని.వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వాలని ఉంటుంది.
అందుకే పెళ్లికి పది రోజులు ఉందనగా చర్మంపై ఎక్కడలేని శ్రద్ధ వచ్చేస్తుంటుంది.ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవల్, వ్యాక్సింగ్( Bridal Makeup ) అంటూ బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయితే అందాన్ని పెంచుకునేందుకు కాబోయే పెళ్లి కూతుళ్లు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉండాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీ( Beauty Tips )ని కచ్చితంగా పాటించాలి.మరి ఆ రెమెడీ ఏంటి.దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కాటన్ క్లాత్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి వాటర్ ను పూర్తిగా తొలగించాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, చిటికెడు పసుపు వేసుకోవాలి.
అలాగే ఉడికించిన తర్వాత వచ్చే గంజి( Startch )ని సరిపడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
పెళ్లికి రెండు వారాలు ఉందనగా అమ్మాయిలు రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించండి.

తద్వారా మీ చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్( Deadskin Cells ), బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.
చర్మం పై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.మొటిమలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
మరియు పెళ్లి సమయానికి మీ అందం రెట్టింపు అవుతుంది.అందరి చూపులు మీ పైనే పడతాయి.
కాబట్టి కాబోయే పెళ్లి కూతుళ్లు ఈ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.