మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, తులసి చెట్టు కు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు.
ఉసిరి చెట్టును భక్తులు విష్ణు స్వరూపంగా చెబుతూ ఉంటారు.అయితే కార్తీకమాసంలో తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు.
తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల పుణ్య పలితాలు ఉంటాయని భక్తుల నమ్ముతారు.కార్తీకమాసంలో తులసి మొక్కను పూజించడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీకమాసంలో ఎక్కువమంది భక్తులు మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఎక్కువగా పూజిస్తుంటారు.ఉసిరి చెట్టును నారాయణుడిగా, తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు.
విష్ణుకు ఇష్టమైన మాసం కావడం వల్ల ఈ మాసంలో విష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు.తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు, మధ్యభాగంలో సంస్థ దేవతలు, సర్వ వేదాలతో కొలువై లక్ష్మీదేవి ఉంది అని నమ్ముతారు.
అందువల్లే కార్తీక మాసంలో తులసి దేవుని పూజించడం సకల దేవతలన్నింటిని పూజించిన పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతారు.

ముఖ్యంగా కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు.పురాతన కాలం నుంచి చాలామంది భక్తులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.రోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసికి ఎంతో భక్తితో పూజలు చేస్తారని చెబుతారు.
కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి భూమిపై లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు, కుంకుమలు సౌభాగ్యంగా ఉంటాయని చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే తులసి మొక్కను సర్వరోగ నివారిణిగా సర్వపాప హరిణి గా భావిస్తారు.