మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సుకుమార్ శిష్యుడిగా తన పేరు నిలబెట్టుకున్నాడు.ఈ సినిమా హిట్ అవ్వడంతో బుచ్చిబాబు తారక్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
బుచ్చిబాబు, ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉండనుందని ఉప్పెన సినిమా వచ్చినప్పటి నుండి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.కానీ ఈ సినిమా వచ్చి ఇప్పటికే రెండేళ్లు అవుతున్న ఇంకా బుచ్చిబాబు మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
అయితే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చాడని.కానీ ఈయన ఆ అవకాశాన్ని అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడని తాజా టాక్.
బుచ్చిబాబు, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది.ఈ కారణంగానే ఈయన సినిమాకు ఓకే చేసాడట.అయితే కథ నచ్చితేనే అనే కండిషన్ పెట్టి మరీ ఓకే చేయగా బుచ్చిబాబు ఎన్టీఆర్ కు కథ వినిపించడంలో విఫలం అయ్యాడని.రెండేళ్లుగా ఈయన ఇదే స్క్రిప్ట్ వర్క్ మీద పని చేస్తున్నాడని అయినా మెప్పించలేక పోవడంతో సువర్ణావకాశం కోల్పోయాడు బుచ్చిబాబు.

మరి ఎలాగైనా ఎన్టీఆర్ కోసమే వైట్ చేస్తాడా లేకపోతే మరే హీరోతో అయినా సినిమా చేస్తాడా అనే విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు అయితే వెళ్ళలేదు.అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయి కానీ స్టార్ట్ చేయలేదు.ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైనప్ లో మరొక డైరెక్టర్ కూడా ఉన్నారు.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.