సాధారణ రోజుల్లోనే మనదేశంలో చాలామంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.ఇంటి నిర్మాణంలో, ఇంట్లో ఉండే వస్తువుల వాస్తు గురించి చాలామంది జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.
అలాంటప్పుడు కొన్ని పండుగ వాస్తు నియమాలను కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.అక్టోబర్ 24న దీపావళి కావడంతో చాలామంది ప్రజలు ఇంటిని వాస్తు ప్రకారం అలంకరించుకునే పనిలో ఉన్నారు.
మనదేశంలో చాలామంది ప్రజలు ప్రాంతానికి బట్టి ఒక్కొక్క చోట ఒక ఇంటికి రంగులు వేస్తూ, మరికొంతమంది కొత్త ఫర్నిచర్లనుకుంటూ బిజీగా ఉన్నారు.వాటిని ఇంటిలో వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలో చూసుకుంటున్నారు.
వాస్తు ప్రకారం ఇంటిని అందంగా ఉంచితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని, ఈమె అనుగ్రహం వల్ల సుఖసంతోషాలు పెరుగుతాయని చాలామంది ప్రజల నమ్మకం.
దీపావళి పండుగ రోజు మెయిన్ డోర్ దగ్గర బాగా శుభ్రం చేయాలి.
ఎందుకంటే ప్రధాన ద్వారం దగ్గర తలుపు తుప్పు పట్టి సౌండ్ చేస్తే దాన్ని వెంటనే రిపేరు చేయించుకోవడం మంచిది.తలుపునుండి ఎటువంటి శబ్దం వచ్చినా అది ఆ ఇంటికి అంత మంచిది కాదు.
ప్రధాన ద్వారం మీద వెండి శిల్పాలు, లక్ష్మీ గుర్తులు ఉంచడం మంచిది.ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులతో అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి వస్తుంది.

ఈశాన్య దిక్కున సరిగ్గా శుభ్రం చేసుకోవడం ఆ ఇంటికి చాలా మంచిది.ఈ మూలలో అనవసరమైన పరికరాలను ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.దీపావళికి ముందు రోజులలో ఇంటి నుండి చాలా కాలంగా ఉపయోగించని వస్తువులను వేస్టేజ్ లో వేయడం ఆ ఇంటికి చాలా మంచిది.
పాత పాడైపోయిన బూట్లు, చెప్పులు, పగిలిన గాజులు, పాత వస్తువులు లాంటి పాత వస్తువులు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు.ఇలాంటి పాత వ్యర్ధాలు ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి రాకను అడ్డుకునే అవకాశం ఉంది.