Un Known Calls : ఇకనుండి పరిచయంలేని కాల్స్ వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది... ఎలాగంటే?

ఇకనుండి మీకు గుర్తు తెలియని ఏదైనా నెంబర్ నుంచి కాల్ వచ్చినపుడు కంగారు పడాల్సిన అవసరం లేదు.ఎవరు చేశారో తెలుసుకునే వెసులుబాటు కల్పించబోతుంది TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా).

 From Now On, Even If You Get Uncontactable Calls, You Will Get To Know , Un Know-TeluguStop.com

వచ్చే ఈ మార్పు వలన కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు కాలర్ పేరు డిస్‌ప్లే మీద కనిపించేలా మార్పులు తీసుకొస్తోంది.గుర్తుతెలియని కాల్స్ వలన అనేకమంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాయ్ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపై ఎవరు, ఎవరికి కాల్ చేసినా, వారికి పేరు కనిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది.

టెలికాం ఆపరేటర్ల దగ్గర అందుబాటులో ఉన్న వినియోగదారుల కస్టమర్ KYC రికార్డ్‌ను బట్టి కాల్ చేసిన వారి పేరు ఈజీగా డిస్ ప్లే అవుతుందని వెల్లడించింది.

ఇకపోతే ట్రాయ్ తీసుకునే ఈ నిర్ణయం వలన అనేకమందికి మేలు చేకూరనుంది.ప్రస్తుతం వినియోగదారులు తెలియని కాలర్ గుర్తింపును కనుగొనేందుకు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను వాడుతున్నారు.

డేటా క్రౌడ్‌ సోర్స్‌ గా ఉన్నందున Truecaller లాంటి యాప్‌ లకు చాలా వరకు పరిమితులు అనేవి తుంటాయి.ఈ నేపథ్యంలో కచ్చితమైన ప్రామాణికత ఉండదు.కానీ, ట్రాయ్ తీసుకునే కేవైసీ డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే పేరు వందకు వంద శాతం కచ్చితంగా ఉంటుంది.

Telugu Kyc Ups, Latest, Ups, Trai, Un-Latest News - Telugu

ఎందుకంటే, ఈ KYC డేటా, సర్వీస్ ప్రొవైడర్లు అధికారికంగా ఇస్తారు కాబట్టి ఫేక్ విషయాలు అనేవి దాదాపుగా ఇందులో వుండవు.దీని కారణంగా కాలర్ కు సంబందించి ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది.ఈ చర్యల వలన Spam కాల్స్ ను తేలికగా నివారించే అవకాశం ఉంటుంది.

అలాగే థ్రెటెనింగ్ కాల్స్ నుంచి రక్షణ పొందే అవకాశం కలదు.ముఖ్యంగా అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని TRAI సూచించింది.

అయితే త్వరలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కలదు.కాబట్టి ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube