గోరుచిక్కుడు ను ఎటువంటి వాతావరణ పరిస్థితులలో ఆయన సాగు చేయవచ్చు.అయితే తక్కువ సాంద్రత గల ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.అంటే ఉదజని సూచిక 7.5-8.0 మధ్య ఉండే నెలలు ఈ పంటకు చాలా అనుకూలం అని చెప్పవచ్చు.ఇక ఈ గోరుచిక్కుడు కూరగాయ పంట మాత్రమే కాదు.
గోరుచిక్కుడు గింజలతో జిగురు తయారు చేసి, ఆ జిగురుతో నూనె, బట్టలు, పేపర్, బ్యూటీ ప్రొడక్ట్స్ లలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు.
గోరుచిక్కుడు సాగులో మేలురకం విత్తనాల విషయానికి వస్తే పూసమౌసమి విత్తనాలు ఖరీఫ్ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి.
కాయలు 10 నుండి 12 సెంటీమీటర్ల పొడవు పెరిగి 70 నుండి 80 రోజుల మధ్యలో కోతకు వస్తాయి.ఇక ఖరీఫ్ మరియు వేసవి కాలాలలో పుసాసదబహార్ విత్తనాలు అనుకూలం.
ఇవి 12 నుండి 13 సెంటీమీటర్ల పొడవు ఉండి 40 నుండి 45 రోజులకే మొదటి కోతకు వస్తాయి.పుసానవబహార్ విత్తనాలు ఖరీఫ్ మరియు వేసవికాలంలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
చెట్టు నిటారుగా పెరుగుతుంది.కొమ్మలు మాత్రం ఉండవు.

ఇక విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది.కిలో విత్తనాలలో ఐదు గ్రాముల ఇమిడ క్లోప్రిడ్, నాలుగు గ్రాముల ట్రైకోడెర్మ విరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి.ఇక నేలను కనీసం మూడు లేదా నాలుగు సార్లు దుక్కి దున్ని నట్లయితే కలుపు సమస్య పెద్దగా ఉండదు.ఇక జనవరి నుండి ఫిబ్రవరి మధ్యలో ఎకరాకు 13-15 కిలోల విత్తనాలను నాటుకోవాలి.
పశువుల ఎరువు వాడినట్లయితే గోరుచిక్కుడు లో నాణ్యత అనేది మెరుగుగా ఉంటుంది.విత్తిన మూడు రోజులకే నీరు పెట్టి, తర్వాత వారానికి ఒకసారి నీరు పెట్టాలి.

ఇక ఎరువుల విషయానికి వస్తే 6 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ ఎరువులు దుక్కి దున్ని పైరుకు అందించాలి.తరువాత ఆరు కిలోల నత్రజనిని విత్తిన 30 నుండి 40 రోజుల మధ్యలో వేసుకోవాలి.ఇక చివరి దశలో ఆరు కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి.ఇక చీడపురుగుల నివారణకు పాసలోన్ లేదా ఫ్రిప్రోనిల్ 2 ml, లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడి పొందవచ్చు.







