మన భారతదేశంలో చాలా మంది ప్రజలు పండుగలను ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకుంటారు.అలాగే అలా వైభవంగా జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి( Maha Shivaratri ) ముఖ్యమైనది అనేకచితంగా చెప్పవచ్చు.
మహాశివరాత్రి రోజు శివాలయాలు అన్ని భక్తులతో రద్దీగా మారుతాయి.అలాగే శివరాత్రి రోజు ప్రత్యేక పూజలుతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది.
దీని వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాలలో ఉంది.శివరాత్రి రోజు ఏ వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే శివుడికి ఎంతో ఇష్టమైనది ఆవు.ఆ రోజు గోధుమపిండితో తయారు చేసిన చపాతీలను ఆవుకు తినిపిస్తే జీవితంలో ఎటువంటి సమస్యలైనా సులభంగా దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.శివరాత్రి రోజున పాలను( Milk ) దానం చేయడం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది.అలాగే శివుడికి పాలు అంటే ఎంతో ఇష్టం.పూజ చేసిన తర్వాత పేదవారికి పాలను దానం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు పరమశివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.
శివరాత్రి రోజు ఆవు పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించడంతో పాటు పేదలకు దానం చేయాలి.దీని వల్ల మీరు అదృష్టవంతులు అవుతారు.మహా శివుడికి ఎంతో ఇష్టమైన ఖీర్ నైవేద్యాన్ని దానం చేయాలి.
అలాగే శివరాత్రి రోజు శివపార్వతులకు( Shiva Parvathi ) ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ నైవేద్యాన్ని దానం చేయడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.శివరాత్రి రోజు శని దేవుడికి( Shanidev ) ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను దానం చేయడం మంచిది.ఆ రోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే మీ కుటుంబంలోకి సుఖ సంతోషాలు వస్తాయి.శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
ఆ తర్వాత నలుగురు పేదవారికి దానం చేయడం ఎంతో మంచిది.ఇలాంటి దానం మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసి సంపదలను పెంచుతుందని చెబుతున్నారు.
DEVOTIONAL