శుభకార్యాలలో "శ్రీ" కారం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?

మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ముందుగా శ్రీ కారంతోనే మొదలు పెడతాము.శ్రీకారం శుభకరం! శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుంది.

 Importance Of Sri Karam In Functions Marriages And House Warming, Importance ,-TeluguStop.com

అంతేకాకుండా మనం ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు కొందరు ఆ పనికి “శ్రీకారం” చుట్టారు అని అంటారు.ఒక వివాహ పత్రిక రాసేటప్పుడు కానీ, నామకరణం కానీ, గృహప్రవేశం కాని జరిగినప్పుడు మొదటగా శ్రీకరం ,శుభకరం అనే పదాలు రాసే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

అయితే శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు శ్రీ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

శ్రీ అనే శబ్దానికి శోభ, శాంతి, లక్ష్మి మొదలైన అర్ధాలున్నాయి.

 మంత్రసాధనలో కూడా శ్రీం బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది.శ్రీ అనే పదాన్ని ఎంతో గౌరవప్రదంగా ఉపయోగిస్తారు.

మనం ఎవరినైనా పెద్దవారిని పిలిచేటప్పుడు వారి పేరు ముందు శ్రీ అనే పదం ఉపయోగించడం మనం చూస్తుంటాము.అంతేకాకుండా శ్రీ అనే పదాన్ని స్త్రీ వాచకంగా కూడ ఉపయోగిస్తారు.

అందుకోసమే సీతతో కూడిన రామున్ని శ్రీరాముడు అని పిలుస్తుంటారు.

Telugu Sri Karam, Importance, Importanesri, Deeds-Telugu Bhakthi

శ్రీ అంటే ఆనందం, తేజస్సు, బ్రహ్మశక్తి కలయిక.విశ్వంలో ఏది అంతిమమో, ఏది అనాదియో అదే శ్రీ.దాని గురించి తెలుసుకునే విద్యనే శ్రీ విద్య అంటారు.

శ్రీ విద్య అనగా అమ్మవారి ఉపాసకులు అని కూడా అంటారు.సాక్షాత్తు త్రిమూర్తులకు ఆశ్రయం ఇచ్చే శక్తిని శ్రీ అనే పిలుస్తారు.

అందువల్ల ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు ముందుగా శ్రీకారం వాడటం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం ఆ కార్యం పై ఉండటం వల్ల ఆ శుభకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా కలుగుతాయని భావిస్తారు.అయితే ప్రస్తుతం “శ్రీ” అనే పదాన్ని శుభకార్యాల్లోనూ, గౌరవప్రదంగా, శుభప్రదమైనదిగా మాత్రమే ఉపయోగిస్తున్నారు.

నిజానికి శ్రీ కారం ఒక బీజాక్షరం అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube