ప్రస్తుత రోజులలో చిన్న పిల్ల వారి నుంచి పెద్ద వారి వరకు అందరూ బయట ఫుడ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఇక చిన్న పిల్లలైతే ఎక్కువగా బేకరీలో ఉండే వెరైటీ స్వీట్లను ( Variety of sweets )తినడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు.
అయితే మనం తీసుకునే ఆహారం విషయంలో బయట శుభ్రత గురించి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందే.ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి పరిశీలిస్తే చాలా మంచిది.
ఇకపోతే ప్రస్తుతం ఓ బేకరిలోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇది చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు.
ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
వైరల్ అవుతున్న వీడియోలో బేకరీలో ఉంచిన స్వీట్స్ పై ఒక ఎలుక ( Rat )అటు ఇటు పరిగెత్తడం మనం చూడవచ్చు.ఇక ఈ స్వీట్ షాప్ వచ్చి ఢిల్లీలోని భజన్‌పూర్( Bhajanpur in Delhi ) ప్రాంతంలోని అగర్వాల్ స్వీట్స్ అని తెలుస్తోంది.ఒక బేకరీలోని గ్లాస్ డిస్ ప్లే కేసులో ఉంచిన స్వీట్లపై ఎలుక ఇలా నడవడం చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
స్వీట్ షాప్ కి స్వీట్స్ కొనడానికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడి పరిస్థితిని చూసి ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.అంతే ఈ వీడియో అనతి కాలంలో బాగా పాపులర్ అయ్యింది.
ఇక ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ స్పందిస్తూ.షాపులలో తిండి పదార్థాలు కొనే సమయంలో పలు జాగ్రత్తలు పాటించడం మంచిది అంటూ కామెంట్స్ చేస్తుండగా.మరికొందరేమో దేవుడా ఇకపై బేకరీలకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని కామెంట్ చేసారు.