కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు

కొద్దిరోజుల క్రితం వరకు రాజ్ తరుణ్, లావణ్య( Raj Tarun, Lavanya ) వివాదం నడిచింది.ఆ అంశం ఏ రేంజ్ లో నడిచిందో అందరం చూశాం.

 Choreographer Johnny Master National Award Cancelled, Jani Master, Choreographer-TeluguStop.com

ఆ వివాదంలో భాగంగా ఆడియో క్లిప్స్, ఫొటోలు అంటూ చాలానే లీక్ అయ్యాయి.వాటిపై మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలలో పెద్ద చర్చావేదికలు నడిచాయి కూడా.

ఆ విష్యం మరిచిపోయే లోపల ఇప్పుడు జానీ మాస్టర్ వంతు వచ్చింది.జానీ మాస్టర్( Johnny ) లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసారు పోలీసులు.ఓ కొరియోగ్రాఫర్ ను అత్యాచారం చేసినందుకు గాను, ఆ అత్యాచారం సమయానికి ఆమె మైనర్ అనేది కేసు.

Telugu Choreographer, Jani Master, National Award-Latest News - Telugu

తాజాగా ఇందుకు సంబంధించి కూడా చాలానే లీకులు మొదలయ్యాయి.ఇందులో బీగంగా జానీ మాస్టర్ డ్రైవర్, బాధితురాలితో మాడ్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అందులో మాట్లాడినట్టు ఉంది.ఇక మహిళా కొరియోగ్రాఫర్‌‌పై( female choreographer ) అత్యాచారం కేసు నేపథ్యంలో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన విషయం విధితమే.

అయితే, నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరడంతో మంజూరు చేసారు.

Telugu Choreographer, Jani Master, National Award-Latest News - Telugu

కాకపోతే ఇప్పుడు, జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేయమని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.ఈ దెబ్బతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ చలనచిత్ర అవార్డును( National Film Award ) రద్దు చేశారు అధికారులు.ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో, అవార్డు కమిటీ వచ్చిన అవార్డు గౌరవాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైన జానీ మాస్టర్ న్యూఢిల్లీలో జరగవలిసిన అవార్డు వేడుకకు హాజరు కావడానికి మధ్యంతర బెయిల్ ను పొందారు.జానీ మాస్టర్ అక్టోబర్ 8న తేదీన అవార్డును తీసుకోవాల్సి ఉండగా.

తాజాగా రద్దు నిర్ణయంతో, ఇప్పుడు ఆయన బెయిల్ పై సంసిద్ధం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube