దర్శకుడు కేవీరెడ్డి( Director KV Reddy ) పేరు చెపితే చాలు ఎంతోమందికి ఆయన ఒక ఆదర్శమని చెప్తూ ఉంటారు కేవలం తీసింది 14 సినిమాలే అయినా కూడా ఆయన అందరి దృష్టిలో కూడా ఒక గొప్ప దర్శకుడు అని పిలిపించుకున్నారు.అందుకు అనేక కారణాలు ఉన్నాయి.
మొదటిది ఆయన కథపై చేసే కసరత్తు.దాని గురించి ఎన్ని వందల సార్లు చెప్పుకున్నా కూడా తక్కువే.
ఇప్పుడు అసలు కథ ఏంటో డైలాగులు ఏంటో పూర్తిగా తెలియకుండానే సెట్స్ పైకి వెళ్ళిపోయి కోట్లకు కోట్లు డబ్బు నష్టం చేస్తున్న దర్శకులు ఉన్న రోజులు కానీ అప్పట్లో అలా ఉండేది కాదు.ఒక సినిమా తీయాలి అంటే దాని వెనకాల ఎంతో యజ్ఞం చేస్తే కానీ అది బయటకు వచ్చేది కాదు.
ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే కె.వి.రెడ్డి అప్పట్లో సినిమా తీయాలంటే అందుకోసం అప్పటి దర్శకుడు అయిన నరసరాజును ( Narasaraju ) ఏ వాదన బంధి పెట్టుకోకుండా ఇంటి బాధ్యతలు అన్నీ కూడా పూర్తిచేసుకుని రమ్మని చెప్పేవారు దాంతో అతను అన్ని పూర్తి చేసుకొని ఆ తరువాత కథపై కూర్చుని వారట కసరత్తులన్నీ చేసి తీసుకురావడానికి దాదాపు నాలుగు నెలల నుంచి ఆరు నెలల సమయం పట్టేదట.

ఇంటి చుట్టుపక్కల ఉండే మహిళలు, పిల్లలు, టాక్సీ డ్రైవర్ వంటి ఎంతో మందిని రకరకాల వృత్తుల నుంచి పిలిపించుకొని ఒక టీంనీ రెడీ చేసి ఆ టీం కి వారు తయారు చేసిన కథను( Movie Story ) వినిపించే వారట.తర్వాత మరొక 15 రోజులపాటు సమయం తీసుకుని వారిలో నుంచి ఒక్కొక్కరిని పిలిచి ఆరోజు చెప్పిన కథను మళ్ళీ చెప్పమనే వారట వారు గుర్తు తెచ్చుకున్న విషయాలు గుర్తుంచుకున్న విషయాలను వేరేవి వేసుకునేవారు అందులో ఏమైనా వీక్స్ సన్నివేశాలు ఉంటే తీసేసి వారట అలా ఆ మొత్తంగా కథ రెడీ అయ్యాక మళ్లీ డైలాగ్స్ పై కూర్చునే వారట హీరోని బట్టి అతడు వీక్నెస్ ఏంటి బలం ఏంటి అని చూసుకుని డైలాగ్స్ రాసి సినిమా తీసేవారట.

ఇలా ఇంత కసరత్తు చేస్తే కానీ అది కార్యరూపం దాల్చేది కాదు.టెక్నికల్ టీం అందరికీ కూడా కథ చెప్పి వారిని కూడా ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే సూచనలు ఉన్నా చెప్పమని చెప్పేవారట ఇలా వందల మంది ఓకే చేసిన సినిమానే సెట్స్ పైకి వెళ్ళేది అందుకే ఆయన అన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న డజన్ సినిమాలకు పైగా తీయలేకపోయారు కానీ దాసరి( Dasari ) రాఘవేంద్రరావు( Raghavendra Rao ) లాంటి వాళ్ళు వందకు పైన సినిమాలు తీశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు.







