నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తన హీరో మోక్షజ్ఞ( Mokshagna ) ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.సినిమాలలోకి మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
అయితే మొన్నటి వరకు ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫామ్ అయ్యిందని ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ నటిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.అంతేకాకుండా మోక్షజ్ఞ కొత్త లుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దాంతో అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఆనందంలో ఉన్న అభిమానులకు షాక్ ఎదురయ్యేలా ఉంది.
ఆ ఆనందం ఆదిలోనే ఆవిరి అయ్యేలా కనిపిస్తోంది.
మోక్షజ్ఞ ఎంట్రీ మొదట్లోనే స్పీడ్ బ్రేకర్ పడినట్టు తెలుస్తోంది.ఆర్భాటంగా ప్రకటన ఇచ్చి లుక్కు కూడా రివీల్ చేశారు.తీరా ముహూర్తం షాట్ వచ్చేసరికి మూవీ ఆగిపోయిందట.
అయితే కారణాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం సినిమా పూర్తిగా నిలిచిపోయిందని కొన్ని వార్తలు, తాత్కాలికంగా మాత్రమే నిలిచిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కొందరేమో సినిమా పూర్తిగా ఆగిపోయిందంటారు.మరికొందరేమో, మార్పుచేర్పులతో మళ్లీ సెట్స్ పైకి వస్తుందంటారు.
కొడుకు ఆరోగ్యం బాగాలేదని ఇటు బాలకృష్ణ, మోక్ష్ సినిమాపై వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ అటు ఎస్ఎల్వీ సినిమాస్ ప్రకటనలు ఇచ్చినప్పటికీ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు డెబ్యూ ఉండకపోవచ్చని చాలామంది ఒక అంచనాకు వచ్చేశారు.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే రామ్ చరణ్( Ram Charan ) తో బాలకృష్ణ చేసిన చిట్ చాట్ కార్యక్రమం లో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్( Akira Nandan ) డెబ్యూ గురించి అడిగారు బాలయ్య.దానిపై పెద్దగా స్పందించని చరణ్, ఆ వెంటనే మోక్ష్ డెబ్యూ ఎప్పుడంటూ రివర్స్ లో బాలయ్యను ప్రశ్నించాడు.ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి.
నవ్వుతూనే అతి త్వరలో అనేశారు.నిజంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే సినిమా ఉంటే బాలయ్య వెంటనే ఆ విషయాన్ని అక్కడే చెప్పేసేవారు.
కొత్త ముహూర్తం అంటూ టాపిక్ ను కొనసాగించేవారు.కానీ బాలకృష్ణ సమాధానం చూస్తుంటే, మోక్ష్ డెబ్యూ మళ్లీ మొదటి కొచ్చినట్టుంది.
మరి ఈ వార్తలన్నింటికీ సమాధానాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.ఏదేమైనా ఈ విషయంలో మాత్రం నందమూరి అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.