1.మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా సోకింది.ఈ విషయం ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
2.జియో కస్టమర్ కేర్ పేరుతో మోసం
జియో కస్టమర్ కేర్ పేరుతో పలువురు వినియోగదారులకు ఫోన్ లు చేస్తూ, కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు మహిళలను మోసం చేసి 2.70 లక్షలు కాజేశారు.దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
3.17న టీచర్ల సామూహిక నిరాహార దీక్షలు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17న తెలంగాణలోని ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి తెలిపింది.
4.కాజల్ దంపతులకు చిరంజీవి ఆశీర్వాదాలు
తెలుగు టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు దంపతులను మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ సెట్ లో ఆశీర్వదించి వారితో కేక్ కట్ చేయించారు.
5.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు
కరోనా ఎఫెక్ట్ కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
6.బాలీవుడ్ నటి కి పక్షవాతం
ఇటీవల కరోనా వైరస్ ప్రభావానికి గురైన బాలీవుడ్ నటి శిఖా మల్హోత్ర పక్షవాతానికి గురయ్యారు.ఈ విషయాన్ని ఆమె మేనేజర్ అశ్విన్ శుక్లా వెల్లడించారు.
7.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.బిగ్ బాస్ – ఆమె లేకపోతే పిచ్చి లేస్తోంది
బిగ్ బాస్ నాలుగో సీజన్ నేటితో 100 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది.ఇటీవల హౌస్ నుంచి మోనాల్ ఎలిమినేట్ అవ్వడంపై అఖిల్ స్పందించారు.ఆమె తోడు లేకపోవడంతో పిచ్చి లేస్తుందని హారిక వద్ద తన బాధ చెప్పుకున్నాడు.
9.కమల్ పార్టీతో ఎంఐఎం
తమిళనాడు మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్ హాసన్ , ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య 2021 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
10.ఏపీ ఎన్నికల అధికారి పై ఫిర్యాదు
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో నివసించకుండా తెలంగాణలో నివసిస్తూ.ప్రతినెల ఇంటి అద్దె అలవెన్స్ పొందుతూ ప్రభుత్వం ను మోసం చేస్తున్నారు అంటూ సమాచార హక్కు ఉద్యమ ఐక్యవేదిక ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేసింది.
11.లండన్ లో కఠిన ఆంక్షలు
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లండన్ లో ఆంక్షలు మరింత కఠినం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
12.ఎయిర్ ఇండియా పై టాటా గురి
ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
13.ఢిల్లీకి జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ భేటీ కాబోతున్నారు.
14.పిసిసి అధ్యక్షుడి నియామకం ఆలస్యం
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామక ప్రక్రియ మరింత ఆలస్యం కాబోతోందని, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిజ్యం ఠాకూర్ తెలిపారు.
15.రిజిస్ట్రేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
తెలంగాణలో మూడు నెలల విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ అవుతోంది.
16.చలో అమరావతి ఉద్రిక్తం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన చలో అమరావతి ఉద్రిక్తతకు దారి తీసింది.ఈ క్రమంలో కొంత మంది కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
17.ఫ్లిప్ కార్ట్ లో నోకియా లాప్టాప్ లు
భారత విఫణిలో కి నోకియా లాప్టాప్ లను ఫ్లిప్ కార్డ్ విడుదల చేసింది.
18.తెలంగాణలో కరోనా
నిన్న రాత్రి 8 గంటల వరకు తేలిన లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 491 మందికి కరోనా పాజిటివ్ సోకింది.
19.తిరుమల సమాచారం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసనం నెల 16 నుండి ప్రారంభం కానుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,800 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,960.