గండమూల నక్షత్రం అని ఎందుకు అంటారు.. దాని ప్రభావం ..?

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం కొన్ని నక్షత్రాలను గండమూల నక్షత్రాలు అని పిలుస్తారు.ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు సాధారణంగా ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

 Why Is It Called Gandamula Nakshatra Ts Effect Ganda Mula , Ganda Mula Dosha ,-TeluguStop.com

అవి కేతు గ్రహానికి సంబంధించిన అశ్విని,మాఖ, మూల, బుధ గ్రహానికి సంబంధించిన అశ్విని, జ్యేష్ట, రేవతి నక్షత్రాలు అని చెబుతున్నారు.ఇతర నక్షత్రాల వారితో సమానంగా ఈ నక్షత్రాల వారికి కూడా పురోగతి, ఆరోగ్యం, ఆశలు వగైరాలన్నీ ఉంటాయి.

కానీ ఏదో ఒక సమస్య దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే ఈ నక్షత్రాలకు గురు దృష్టి లేదా కలయిక దివ్యమైన ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది.

ఈ నక్షత్రాలు ఏ విధంగా ఇబ్బంది పెడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Astrology, Devotional, Jobs, Ketu Graham, Vastu, Vastu Tips-Telugu Top Po

ముఖ్యంగా చెప్పాలంటే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు గ్రహం(Ketu Graham ).దీనిని పాపగ్రహం కింద పరిగణిస్తారు.అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి జీవితం విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది.

వీరు కర్మఫలం అనుభవించడానికి పుట్టారని కచ్చితంగా చెప్పవచ్చు.సాధారణంగా వీరు ప్రణాళిక వేసుకున్నట్టుగా ఏదీ జరగదు.

వీరు ఊహించని విధంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది.ఏదైనా ఒక సమస్య పట్టుకుంటే అది అసాధారణంగా ఎక్కువ కాలం కొనసాగుతుంది.

Telugu Astrology, Devotional, Jobs, Ketu Graham, Vastu, Vastu Tips-Telugu Top Po

ఇంకా చెప్పాలంటే మఖ నక్షత్రానికి అధిపతి కేతువు.వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.వీరిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు తెచ్చుకుంటారు.సమాజంలో హుందాగా జీవిస్తారు.అయినా ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు.

జ్యేష్ట నక్షత్రానికి అధిపతి బుధుడు.వీరు ఇతరుల కోసం ఎన్నో ప్లాన్లు వేసి విజయాలు సాధించేలా చేయగలరు.కానీ సొంత విషయాల్లో మాత్రం విఫలం అవుతుంటారు.తమకు లేని సౌకర్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.అనవసర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.సమస్యలను భూతద్దంలో చూస్తూ ఉంటారు.

అలాగే రేవతి నక్షత్రాని( Revati Nakshatra )కి అధిపతి బుధుడు.ప్రణాళికలు వ్యూహాలను రచించడంలో వీరిని మించిన వారు ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు.విరు వృత్తి ఉద్యోగాలలో ఎంతగానో అభివృద్ధి చెందుతారు.అయితే వీరు సున్నిత మనసు కలిగి ఉంటారు.ప్రతి చిన్న విషయానికి అతిగా బాధపడుతూ ఉంటారు.ఏ విషయాన్ని తేలికగా తీసుకోరు.

లో లోపల బాధపడుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube