దేవి లేదా దేవత ఆలయాలకు భారతీయ సంస్కృతిలో మరింత ప్రత్యేక స్థానం ఉంది.అలాగే నవరాత్రుల దుర్గామాత ఆలయాలు కూడా మత విశ్వాసాలు వెళ్లి విరుస్తూ ఉంటాయి.
అటువంటి విశ్వాసంతో ముడిపడి ఉన్న ఆలయాల్లో రాజస్థాన్లోని ఓ గ్రామంలోని ఓ మారుమూల కొండపై ఉన్న 600 ఏళ్ల నాటి దుర్గామాత ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనది.అయితే ఆ ఆలయం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే ఈ దుర్గ గుడిలో పూజారి ఒక ముస్లిం వ్యక్తీ.మన సమాజంలో మతం, కులానికి సంబంధించిన వివిధ నియమాలు, నిబంధనాలు ఉన్నాయి.

అయినప్పటికీ కూడా కొంతమంది దీనికి భిన్నంగా నిలబడి ఒక ప్రత్యేకమైన ఉదాహరణలుగా నిలుస్తూ ఉంటారు.అలాగే మతసామరస్యం, మాతృదేవత పట్ల భక్తితో ముడిపడి ఉన్నా అలాంటి ఒక ఆలయమే ఇప్పుడు తెరపైకి వచ్చింది.దుర్గా ఆలయంలో ఓ ముస్లిం పూజారి మాతృదేవతను పూజిస్తారు.ఆ ముస్లిం పూజారి గొప్ప దేవి భక్తుడు కూడా.అయితే జోధ్ పూర్ జిల్లా( Jodhpur )లోని అటవీ ప్రాంతమైన భోపాల్ఘర్లో బాగొరియా అనే గ్రామం ఉంది.అయితే ఆ గ్రామంలోని ఎత్తైన కొండలపై పురాతన దుర్గ ఆలయం ఉంది.
ఈ ఆలయాన్ని దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు.

అయితే ఈ ఆలయంలో తరతరాలుగా ముస్లిం కుటుంబాలు పూజారులుగా వ్యవహరిస్తూ ఆ దేవతలకు ఆరాధిస్తున్నారు.ప్రస్తుతం జలాలుద్దీన్ ఖాన్ ( Jalaluddin )అనే ఓ ముస్లిం వ్యక్తి ఆ దుర్గాదేవి ఆలయంలో పూజారిగా ఉన్నారు.అయితే ఆ ముస్లిం పూజారి కుటుంబం దేవీ నవరాత్రుల్లో ఉపవాస దీక్షలు, పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
అయితే వందల సంవత్సరాల క్రితం క్రితం సింధ్ ప్రావిన్స్ లో తీవ్రమైన కరువు వచ్చింది.అయితే ఆ ప్రాంతంలో నివసించే జలాలుద్దీన్ పూర్వికులు వేరే ప్రాంతానికి వలస వెళ్లారు.
ఆ క్రమంలో అతని పూర్వీకులు ఒంటెల కాన్వయ్ తో మాల్వాకు చేరుకున్నారు.

అయితే కొన్ని ఒంటెలు( Camel ) అస్వస్థకు గురయ్యాయి.తన పూర్వీకులకు రాత్రిపూట కలలో దేవి కనిపించి సమీపంలోని మెట్ల బావిలో ఉన్న దేవి విగ్రహాన్ని బయటకు తీసి అందులోని నీటిని ఒంటెలకు తాగిస్తే దాని రోగం తగ్గిపోతుందని చెప్పిందట.అలా దేవత చెప్పినట్టుగా జలాలుద్దీన్ ఖాన్ పూర్వికులు చేశారు.
ఇక ఒంటెల ఆరోగ్యం పూర్తిగా నయం అయిపోయింది.ఇలా జరిగిన ఈ అద్భుతాన్ని చూసి తన పూర్వీకులు ఈ గ్రామంలోనే ఉండాలని, ఈ ఆలయంలో ఆ దేవతను పూజించాలని నిర్ణయించుకున్నారట.
ఇక అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడిపోయారు.