సినిమా అనే రంగుల ప్రపంచలంలో అందంతో పాటు అభినయం ఉంటేనే రాణిస్తారు.అందగత్తెల పోటీల్లో కిరీటాలు దక్కించుకున్న పలువురు సుందరీ మణులు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు పొందారు.
పలువురు టాప్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు.అందం, అభినయమే కాదు.
కాస్త అదృష్టం ఉంటేనే వారి కెరీర్ మరింత ఉన్నతంగా ఉంటుంది.అయితే హిందీ చిత్రసీమలో సూపర్ సక్సెస్ అయిన పలువురు బ్యూటీలు తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం అంతగా రాణించలేకపోయారు.
ఇంతకీ బాలీవుడ్ లో దుమ్ములేపి.టాలీవుడ్ లో చతికిలబడ్డ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సెలీనా జైట్లీ

బ్యూటీ కాంటెస్టులో విజేతగా నిలిచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సెలీనా.మంచు విష్ణు వర్ధన్ తో విష్ణు అనే సినిమా చేసింది.ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో టాలీలవుడ్ నుంచి మాయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.అందగత్తెగా విజయవంతం అయినా.తెలుగులో హీరోయిన్ గా మాత్రం పనికిరాలేదు.
ఐశ్వర్యా రాయ్

మిస్ వరల్డ్ గా ప్రపంచ మనసు దోచింది ఐశ్వర్య.టాలీవుడ్ లో నాగార్జునతో రావోయి చందమామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అందాలను ఆరబోసింది.అయినా ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాలేదు.బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ తన హవా కొనసాగిస్తుంది.
ప్రియాంకా చోప్రా

దేశీ బ్యూటీ ప్రియాంక సైతం అందాల పోటీల్లో విజయం సాధించాకే సినిమా రంగంలోకి వచ్చింది.కెరీర్ ఆరంభంలో ఓ తెలుగు సినిమా చేసినా.అది విడుదల కాలేదు.
ఆ తర్వాత రాంచరణ్ తుఫాన్ లో నటించినా ఆకట్టుకోలేకపోయింది.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినా.అంతంత మాత్రంగానే సక్సెస్ అయ్యింది.
అదితి గోవిత్రికర్

ఈ ముద్దుగుమ్మ తమ్ముడు సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించింది.ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.
సారా జైన్

అందాల పోటీ నుంచే వచ్చిన ఈ భామ కూడా తెలుగులో పవన్ కల్యాణ్ తో కలిసి పంజా సినిమా చేసింది.ఈ సినిమా ఫెయిల్ కావడంతో మళ్లీ ఇంకో సినిమాలో కనిపించలేదు.
తనూశ్రీ దత్తా.

అందాల పోటీ నుంచే సినిమాల్లోకి వచ్చిన తనుశ్రీ.తెలుగులో బాలయ్యతో కలిసి వీరభద్ర సినిమా చేసింది.ఈ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు.
గద్దె సింధూర

బ్యూటీ కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన ఈ భామ కూడా.తెలుగులో అమరావతి, సంగమం అనే అనామక సినిమాల్లో నటించింది.ఆ తర్వాత తెలుగు తెరకు దూరం అయ్యింది.
వీరేకాదు.చాలా మంది అందాల పోటీల్లో నెగ్గిన భామలు తెలుగులో మాత్రం సక్సెస్ కాలేకపోయారు.