ప్రెగ్నెంట్ అవ్వాలని.అమ్మ అని పిలిపించుకోవాలని పెళ్లైన ప్రతి మహిళ కోరుకుంటుంది.
ఇక కోరుకున్నట్టుగానే గర్భం దాల్చితే.వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు తరచూ సూచిస్తూనే ఉంటారు.అంతేకాదు, అవి తినాలి.
ఇవి తినకూడదు అని కూడా చెబుతుంటారు.అయితే మనం రెగ్యులర్‌గా వాడే ఉల్లిపాయలను పచ్చిగా గర్భవతులు తినొచ్చా.? అన్నది చాలా మందికి ఉన్న సందేహం.
సాధారణంగా బిర్యాని, పలావ్, పెరుగు అన్నం, పరోటా వంటి వాటితో పాటు పచ్చి ఉల్లిపాయలు తినడం చాలా మందికి ఉన్న అలవాటు.
అయితే పచ్చి ఉల్లి పాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.మరి అలాంటి వాటిని తినడం గర్భవతులకు సురక్షితమేనా? అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది.వాస్తవానికి ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే ఉల్లిపాయల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.
క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్, ఫాస్పరస్ వంటి మినరల్స్‌తో పాటు విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి.ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇక గర్భిణీలకు కూడా సురక్షితమైనవే.
పైగా వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి.అవును, గర్భవతులు తక్కువ మోతాదులో పచ్చి ఉల్లి తింటే.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.దాంతో సీజనల్‌గా వచ్చే రోగాలకు దూరంగా ఉండొచ్చు.
అంతేకాదు, గర్భవతుల్లో ఎక్కువగా కనిపించే అధిక రక్తపోటు, నిద్రలేమి, మలబద్ధకం వంటి సమస్యలను కూడా ఉల్లి దూరం చేస్తుంది.ఇక ప్రీమెచ్యూర్ డెలివరీ సమస్య తగ్గించడంలోనూ ఉల్లి గ్రేట్‌గా సహాయపడుతుంది.
కాబట్టి, గర్భిణీలకు ఉల్లి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.అయితే కట్ చేసి నిల్వ చేసిన ఉల్లిపాయల ను మాత్రం అస్సలు తినకూడదు.
దీని వల్ల ప్రెగ్నెన్సీ మహిళల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.