సోషల్ మీడియాలో అనునిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో ఏకొన్నో నెటిజన్ల మనసుని దోచుకుంటాయి.
వాటిలో కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే, మరికొన్ని బాధాకరంగాను, మరికొన్ని కోపాన్ని తెప్పించేవిగా ఉంటాయి.ఇక ఇంకొన్ని వీడియోలు ఎలా ఉంటాయి అంటే, వాటిని చూసిన తర్వాత షేర్ చేయకుండా ఉండలేము అన్నంతగా ఉంటాయి.
ఇటువంటి వీడియోలలో ఎక్కువగా మనకు జంతువులకు సంబంధించిన వీడియోలే తారసపడతాయి.ఇటీవలకాలంలో చూసుకుంటే ఇటువంటివే ఎక్కువగా ప్రేక్షకుల మన్నన పొందుతున్నాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోని చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.దాన్ని చూసి నవ్వడమే కాకుండా ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒక్కసారి చూసినట్లయితే, ఒక పిల్లి చిన్న ఇయర్ డ్రాప్స్ కి సంబంధించిన బాటిల్ ను టేబుల్ పై నుంచి కిందకు తోసేస్తూ ఉంటుంది.
సరిగ్గా అదే సమయానికి అది చూసిన యజమాని పెద్దగా శబ్దం చేయడంతో ఆ పిల్లి కాస్త వెళ్లి ఆ యజమాని వైపు చూస్తుంది.అప్పుడు ఆ యజమాని అలాంటి ఒక బాటిల్ ని తీసుకొని, పక్కనే వున్న ఓ బొమ్మ ఆ డ్రాప్స్ బాటిల్ ను ఆ బొమ్మ కింద పడేసే విధంగా చేసి, తర్వాత ఆ బొమ్మను చేతులతో కొట్టి.
బొమ్మను విసిరేసి, సేమ్ నీకు కూడా ఇలాగే జరుగుతుంది అన్నట్టుగా ఆ పిల్లికి ఓ ఝలక్ ఇస్తాడు.వెంటనే ఆ తంతుని గమనించి, అర్థం చేసుకున్న ఆ తెలివైన పిల్లి ఇయర్ డ్రాప్స్ బాటిల్ ను కింద పడిపోకుండా మధ్యలోకి జరిపి ఏమీ ఎరగనట్టుగా అటువైపు కూర్చొని అతని వైపు అమాయకంగా చూస్తుంది.అయితే ఆ వీడియోలో పిల్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తోంది.ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
దాంతో ఈ ఫన్నీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.కావాలంటే ఒక్కసారి తిలకించండి.