1 .భారత్ లో కరోనా
గడిచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.భద్రాచలం వద్ద 51 అడుగుల మేర వరద
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.భద్రాచలం వద్ద 51 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంది.
3.పోలీసుల తీరుపై ఈటెల ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ భవన్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
4.ఔటర్ రింగ్ రోడ్డు వద్ద త్వరలో టోల్ ఫ్రీ నెంబర్
ఔటర్ రింగ్ రోడ్ పై త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
5.అమరావతి యాత్రకు టిడిపి సంపూర్ణ మద్దతు
అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.
6.100 కే ట్రావెల్ 24 టికెట్
ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టిసి మరో ఆఫర్ ప్రకటించింది రూ.100 కే 24 గంటల పాటు గ్రేటర్ లో పర్యటించే విధంగా 120 ఉన్న టికెట్ ధరను 20 రూపాయలు తగ్గించింది.
7.మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి.
8.చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకం
చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా చింత ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
9.జేఈఈ అడ్వాన్స్డ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ అడ్వాన్స్డ్ లో ర్యాంకులు సాధించిన గిరిజన విద్యార్థుల ను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
10.ఎమ్మెల్సి కవితకు కరోనా
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
11.ఏపీ ప్రభుత్వంపై వీర్రాజు ఆగ్రహం
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఏం అభివృద్ధి సాధించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు.
12.సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై పవన్ కళ్యాణ్ స్పందన
సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
13.వీఆర్ఏలను చర్చలకు ఆహ్వానించిన కేటీఆర్
గర కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల పరిస్థితి పై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ మేరకు వీఆర్ఏ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.20వ తేదీన దీనిపై చర్చిద్దామని వెంటనే ఆందోళనను విరమించుకోవాలని కేటీఆర్ సూచించారు.
14.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.
15.ఆ ఏడు గ్రామాలను తెలంగాణలో కలపాలి
భద్రాచలం పక్కన ఉన్న ఏడు గ్రామాలను తెలంగాణలో కలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
16.కామినేని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కి ప్రీ పెయిడ్ కార్డు
కామినేని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చారు.
17.సజ్జల కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను జగన్ అప్పగించారు.
18.మార్చి నాటికి తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు
వచ్చే ఏడాది మార్చి నాటికి ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
19. సికింద్రాబాద్ అగ్నిప్రమాదం పై ప్రధాని దిగ్భ్రాంతి
సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పొగ కారణంగా ఊపిరాడక 8 మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,730 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,980
.