'రుద్రుడు' డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు.డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

 'rudrudu' Is A Grand Release Worldwide On 23rd December , Raghava Lawrence, Sar-TeluguStop.com

ఈ సంధర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది.వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ టెర్రిఫిక్ గా వుంది.‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది.శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.

తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube