సలార్ ఫొటోస్ లీక్.. ప్రభాస్ ఎలా ఉన్నాడో మీరు చూశారా?

టాలీవుడ్ యంగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగారు.

 Prabhas Starrer Salaar Pics Set Leak Online Trends On Twitter, Prabhas, Salaar,-TeluguStop.com

బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

సలార్, ఆదిపురుష్ ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

ఇకపోతే టాలీవుడ్ లో ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో మనందరికి తెలిసిందే.

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.అయితే ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో ఫ్యాన్స్‌లో ఆ వార్త విన్న తరువాత అభిమానుల్లో ఎగ్జాయిట్‌మెంట్ ఇంకా పెరిగింది.దీంతో సలార్ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వినిపించిన అది వైరల్‌గా మారడం సాధారణం అయిపోయింది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లోని ఫొటోలు లీక్ అయ్యాయి.అవి ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.అందులో ప్రభాస్ మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు.వాటిని చూసిన అభిమానులు కేజీఎఫ్ సినిమాకి మించిన మంచి మాస్ మసాలా మూవీని ప్రభాస్‌తో ప్రశాంత్ అందించనున్నాడని పలువురు వీటిపై కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube