వైసీపీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం.. అంతలోనే యూ టర్న్ ?

ఇటీవలే కొత్త మంత్రివర్గం జగన్ ఏర్పాటు చేశారు ఈ మంత్రివర్గంలో స్థానం సంపాదించేందుకు చాలామంది  ప్రయత్నించినా,  మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారితో పాటు, కీలక నాయకులు అనుకున్న వారికి పెద్దగా పదవులు దక్కలేదు.దీంతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యే లు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.

 Ysrcp Mla Golla Babu Rao Clarification On Own Comments , Ysrcp , Ysrcp Mla , Gol-TeluguStop.com

వాళ్లలో కొంతమంది సైలెంట్ గా అధిష్టానానికి తమ సమ్మతిని తెలియజేస్తున్నారు.మరికొంతమంది మాత్రం అధిష్టానం పై ఇప్పటికీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తునే ఉన్నారు.

  ఈ క్రమంలోనే పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ అధిష్టానం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గొల్ల బాబూరావు హరుని ఇప్పటికే ఎంతో మంది నేతలు తమకు మంత్రి పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వారిలో కొంత మందికి వైసీపీ అధిష్టానం కీలక పదవులు ఇస్తామని హామీ ఇవ్వగా,  మరి కొంతమంది విషయంలో సైలెంట్ గా ఉండడం వంటి కారణాలతో ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని ఇలా బయటకి వెళ్లగక్కుతున్నారు.

బోడి రాజకీయాలు నాకెందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన పని నాకు లేదు.

మంత్రి పదవి నాకు దక్కకుండా అధిష్టానం నన్ను దెబ్బకొట్టింది అంటూ  సంచలనం సృష్టించారు.పాయకరావుపేట నియోజకవర్గం లో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాబురావు ఈ విధంగా అధిష్టానంపై ఫైర్ అయ్యారు.

బాబురావు వ్యాఖ్యలు దుమారం రేగడంతో  వైసిపి అధిష్టానం సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుంది.దీంతో గొల్ల బాబు రావు తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు.
 

Telugu Ap, Ap Cm Jagan, Golla Baburao, Jagan, Ysrcp, Ysrcp Mla-Telugu Political

తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తమని వివరణ ఇచ్చారు.తాను హింసావాదిని కాదని , అహింసవాదినేనని అన్నారు.సోషల్ మీడియా లో తన పై వస్తున్న వార్తల్లో వాస్తవం ఏ మాత్రం లేదన్నారు.మీకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేసింది అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆ విషయాన్ని  అధిష్టానంనే అడగమని చెప్పానే తప్ప, అధిష్టానాన్ని ధిక్కరించి తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube