ప్రతి రోజు మనం చేసుకొనే పనుల కారణంగా దెబ్బలు తగలటం సహజమే.దెబ్బలు తగ్గినా ఆ మచ్చలు మాత్రం ఆలా ఉండిపోయి అసహ్యంగా కనపడతాయి.
ఆ మచ్చలను తొలగించుకోవడానికి అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం.అయినా ఫలితం కొద్దిగా మాత్రమే ఉంటుంది.
అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే నూనెలను ఉపయోగిస్తే నల్లని మచ్చలు శాశ్వతంగా తొలగిపోతాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
లావెండర్ ఆయిల్
దెబ్బ తగిలిన వెంటనే లావెండర్ ఆయిల్ ని రాస్తే మంచి ఉపశమనం రావటమే కాకుండా మచ్చ పడకుండా చేస్తుంది.అలాగే పాత మచ్చలు ఉంటే లావెండర్ ఆయిల్ ని నీటిలో కలిపి క్రమం తప్పకుండా రాస్తే మంచి ఫలితం కనపడుతుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి ప్రతి రోజు రాస్తూ ఉంటే నిదానంగా గాయాల వలన కలిగిన మచ్చలు తొలగిపోతాయి.కొబ్బరినూనెలో ఉన్న విటమిన్ E మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో అద్భుతమైన తేమ లక్షణాలు ఉన్నాయి.దెబ్బ తగిలి మచ్చ పడిన చోట ఆలివ్ ఆయిల్ ని రాస్తే ఆ ప్రదేశంలో మృత కణాలను తొలగించి మచ్చ పోయేలా చేస్తుంది.
ఆవనూనె
ఆవనూనెలో ఉన్న అద్భుతమైన గుణాలు ఎంత మొండి మచ్చలను అయినా తగ్గిస్తాయి.అయితే చాలా మందికి ఆవనూనె వాసన పడదు.
అందువల్ల ఆవనూనె ఉన్న క్రీమ్స్ వాడవచ్చు.ఆవనూనె వాసన నచ్చినవారు మాత్రం ప్రతి రోజు ఆవనూనెను మచ్చలపై రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటే మచ్చలు తగ్గి చర్మం రంగులో కలిసిపోతుంది.
.