సాధారణంగా మార్చి నెల పరీక్ష కాలం అనే సంగతి తెలిసిందే.ఈ నెలలో సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపరు.
అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాల్సి ఉంది.
మార్చి నెల 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ( Operation Valentine movie )విడుదలవుతోంది.రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నా ఈ సినిమాకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఈరోజు రాత్రి నుంచి కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతున్నాయి.పెయిడ్ ప్రీమియర్స్ టాక్ ఆధారంగా ఈ సినిమా కలెక్షన్లు ఉండబోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా వరుణ్ తేజ్( Varun Tej ) కెరీర్ కు ఈ సినిమాతో సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.
ఈ నెల 8వ తేదీన విశ్వక్ సేన్ గామి( Gami ), గోపీచంద్ భీమా( bheema ) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.ఈ నెల 15వ తేదీన తంత్ర సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ నెల 22వ తేదీన శ్రీవిష్ణు నటించిన ఓం భీం భుష్( Om Bheem Bhush ) అనే సినిమా విడుదల కానుండటం గమనార్హం.
ఈ నెల చివరి వారంలో టిల్లు స్క్వేర్ ( Tillu Square )సినిమా విడుదల కానుండగా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాలన్నీ సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చూడాలి.