సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మాట్లాడే మాటల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి.నాగబాబు( Naga Babu ) తాజాగా వరుణ్ తేజ్( Varun Tej ) హైట్ గురించి చెబుతూ 5 అడుగుల 3 అంగుళాలు ఉండే హీరోలు పోలీస్ పాత్రలకు సూట్ కారని కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ కాగా ఆ కామెంట్స్ కొంతమంది హీరోల అభిమానులను ఎంతో బాధ పెట్టాయి.అయితే నాగబాబు తాజాగా ఆ కామెంట్ల గురించి క్షమాపణలు పెట్టారు.
తన కామెంట్లను వెనక్కి తీసుకోవడంతో అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇష్టానుసారం కామెంట్లు చేసి సారీ అంటే సరిపోతుందా నాగబాబు? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.మీ కొడుకును పొగడటంతో తప్పు లేదని ఇతర హీరోలను కించపరిచేలా కామెంట్లు ఎంతవరకు సబబు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నాగబాబు భవిష్యత్తులో కూడా ఇవే తప్పులను పునరావృతం చేస్తే మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నాగబాబు కామెంట్ల వల్ల ఆపరేషన్ వాలంటైన్ ( Operation Valentine )సినిమాకు నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఆపరేషన్ వాలంటైన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
నాగబాబు ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.2024 ఎన్నికల్లో ఎంపీగా నాగబాబు పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది.2024 ఎన్నికల్లో నాగబాబు విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.నాగబాబు పొలిటికల్ గా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.నాగబాబు జనసైనికుల సపోర్ట్ తో ఏ రేంజ్ లో రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
జనసేన ఏపీలో 3 ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.