రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక పైన ఎన్నికల హామీలపైన ప్రధానంగా దృష్టి సారించాయి.ఈసారి జరగబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మక కావడంతో , దానికి తగ్గట్లుగానే వ్యూహాలు పన్నుతున్నాయి.
ఒక పార్టీపై మరో పార్టీ పై చేయి సాధించేలా ఎత్తుగడలు వేస్తున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్ బిజెపిల ( Congress BJP )కంటే బిఆర్ఎస్ ఓ ముందడుగు వేసింది.
పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.ఈ విషయంలో కాంగ్రెస్ , బిజెపిలో ఇంకా వెనకబడే ఉండగా, బీఆర్ఎస్ పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు గత కొద్ది రోజులుగా మేనిఫెస్టో తయారీ పైనే కేసీఆర్ నిమగ్నమయ్యారు .

కెసిఆర్ బయటకు కనిపించడం లేదంటూ బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నా, కేసీఆర్( CM kcr ) అవేమి పట్టించుకోవడం లేదు.ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములను ప్రకటించింది.గిరిజన వర్సిటీ , పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోది ఇచ్చిన హామీలతో బిజెపి మంచి జోష్ లో ఉంది .దీంతో ఈ రెండు పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ ఎన్నికల( BRS election ) మేనిఫెస్టో పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.పార్టీ సీనియర్ నాయకులు, కీలక అధికారులతో చర్చించి మేనిఫెస్టో కు తుది మెరుగులు దుద్దుతున్నారట.
విపక్షాల మైండ్ బ్లాక్ అయ్యే విధంగా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని ఇప్పటికే మంత్రి హరీష్ రావు( Harish Rao ) ప్రకటించడంతో, బీఆర్ఎస్ మేనిఫెస్టో పై మరింత ఆసక్తి నెలకొంది.ఇప్పటికే కల్యాణ లక్ష్మీ పథకం నుంచి మొదలు పెడితే, రైతుబంధు వంటి ఎన్నో పథకాలు తమ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయని , ఎన్నో రాష్ట్రాలు ఈ పథకాలను కాపీ కొట్టాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.</

రాబోయే ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక కావడంతో వారిని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను కేసీఆర్ ( CM kcr ) రూపొందిస్తున్నారట .కాంగ్రెస్ , బిజెపిల కంటే భిన్నంగా కెసిఆర్ మేనిఫెస్టో రూపొందిస్తున్నారని, ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు కీలకం. వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో ఆ పార్టీ విజయం ఖాయం అని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
దీంతో మహిళలను ఆకట్టుకునే విధంగా నగదు బదిలీ పథకం వంటివి ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఎలా ఉంటుందనే దానిపైన కెసిఆర్ కసరత్తు చేస్తున్నారట .ముఖ్యంగా నెలనెలా మహిళలకు నేరుగా నగదు ఇవ్వడమా లేక మహిళలకు ఒక్కొక్కరికి లక్ష లేదా రెండు లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వడమా అనే దానిపైన అధికారులు సీనియర్ నేతలతో చర్చిస్తున్నారట.