యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది.
ఇలా ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు ఇక్కడ ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ ఏ కార్యక్రమంలో పాల్గొన్న తన అభిమానులకు( NTR Fans ) ఒకే విషయాన్ని చెబుతూ ఉంటారు.మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి మీకోసం ఇంట్లో మీ తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఎప్పుడు అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
ఈ జన్మలో ఎన్టీఆర్ తన అభిమానులకు ఎంత చేసిన వడ్డీ మాత్రమే చెల్లించుకుంటానని వచ్చే జన్మలో ఋణం తీర్చుకుంటానంటూ కూడా ఇటీవల కామెంట్లు చేశారు.
ఇలా అభిమానుల కోసం ఎంతో ఆరాటపడే ఎన్టీఆర్ అభిమానుల విషయంలో తనకు ఎప్పుడు ఒక వెలితి ఉంటుందని తెలిపారు.తన అభిమానులు ఎల్లప్పుడూ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తానని మరోసారి తెలిపారు.అయితే ఇటీవల కాలంలో భద్రత కారణాల వల్ల తాను అభిమానులను స్వయంగా కలుసుకోలేకపోతున్నానని ఇదే చాలా వెలితిగా ఉంది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల దేవర సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చివరి క్షణంలో భద్రత కారణాలవల్ల క్యాన్సిల్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.