సాధారనంగా కొందరు జుట్టు తరచూ డ్రై అవుతుంటుంది.ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పులు, పోషకాల కొరత, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వినియోగించడం, ఎండల ప్రభావం, రెగ్యులర్‌గా తల స్నానం చేయడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు డ్రైగా మారిపోతుంటుంది.
దాంతో ఏం చేయాలో తెలీక.ఎలా డ్రై హెయిర్‌ను వదిలించుకోవాలో అర్థంగాక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్‌ను ట్రై చేస్తే గనుక ఎంతో సులభంగా పొడి జుట్టును నివారించుకోవచ్చు.మరి ఆ హెయిర్ మాస్క్ ఏంటీ.?
దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక అవకాడో పండును తీసుకుని గింజ తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ అవకాడో పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం వేరుచేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో బాగా పండిన అరటి పండు తీసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ అరటి పండు పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల అవకాడో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ అల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ మాస్క్ సిద్ధమైనట్టే.
దీనిని ఎలా వాడాలంటే.ముందుగా మీ రెగ్యులర్ ఆయిల్‌ను గోరు వెచ్చగా చేసి జుట్టుకు పట్టించాలి.ఆపై తయారు చేసుకున్న హెయిర్ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి. షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గనుక పొడి జుట్టు కాస్త స్మూత్ అండ్ సిల్కీ మారుతుంది.
మరియు హెయిర్ ఫాల్ సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.