టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్( Puri Jagannath ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన సినిమాలను తెరకెక్కించడంలో కాస్త ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి.
పూరి జగన్నాథ్ తో సినిమా అంటే ఒకప్పుడు హీరోలందరూ ఓకే అనేవారు.కానీ ఈ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.
పూరి జగన్నాథ్ తో మూవీ అంటే హీరోలు ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఇందుకు గల ప్రధాన కారణం పూరీ జగన్నాథ్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవ్వడమే.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుస ఫ్లాపులతో కాదు కాదు డిజాస్టర్స్ తో పూరీ డిజప్పాయింట్ చేస్తున్నాడు.అందుకే నెక్స్ట్ సినిమాకు పూరీ సిద్ధం అనేలా ఉన్నా హీరోలెవరు ఆసక్తిగా లేదు.అయితే స్టార్ హీరోల కన్నా సీనియర్ హీరోలు కాస్త పూరీని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.చిరంజీవితో( Chiranjeevi ) ఆటో జానీ ఇంకా చర్చల్లోనే ఉంది.అది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.మరోవైపు బాలయ్య బాబతో పైసా వసూల్ చేసిన పూరీ జగన్నాథ్ మరోసారి బాలకృష్ణతో( Balakrishna ) సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నాడు.

అయితే బాలయ్య కూడా పూరీతో సై అనేస్తున్నారు కానీ కమిటైన సినిమాలు పూర్తయ్యాకే అది కుదురుతుందని తెలుస్తోంద.అలాగే పూరీ జగన్నాథ్ నాగార్జున( Nagarjuna ) కోసం కూడా ఒక కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.పూరి జగన్నాథ్ నాగార్జునతో కలిసి శివమణి సినిమా చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.నాగార్జున కూడా ఒక మంచి మాస్ సినిమా కోసం చూస్తున్నాడు.పూరీ సరైన కథతో వస్తే మాత్రం నాగార్జున సినిమా చేసేలా ఉన్నారు.
అయితే చిరు, బాలకృష్ణ కాదన్నాక నాగార్జున అయినా పూరీని యాక్సెప్ట్ చేస్తాడా లేదా ఆయన కూడా కాదంటారా అన్నది తెలియాల్సి ఉంది.ఎన్ని ఫ్లాపులు ఎదురైనా పూరి జగన్నాథ్ మాత్రం తన ప్రయత్నాలని మానుకోవడం లేదు.







