స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మహేష్( Mahesh Babu ) రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు.అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు లీక్ అవుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
రాజమౌళికి ఈ విధంగా కొత్త తలనొప్పి మొదలైందని చెప్పవచ్చు.
రాజమౌళి మహేష్ సినిమా షూటింగ్ ను ఎక్కువగా ఔట్ డోర్ లో ప్లాన్ చేశారని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
భవిష్యత్తులో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఫోటోలు లీకైతే మాత్రం జక్కన్నకు ఇబ్బందులు తప్పవు.రాజమౌళి మహేష్ కాంబో మూవీ ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వి రాజ్ సుకుమారన్( Prithviraj Sukumaaran ) కీలక పాత్రలో నటిస్తున్నారు.పరిమిత సంఖ్యలో పాత్రలతోనే జక్కన్న ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్.మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2027 సంవత్సరం లేదా 2028 సంవత్సరం లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించే సత్తా ఉన్న సినిమా ఇదేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి అధికారికంగా ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది.ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.మహేష్ జక్కన్న కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ సినిమా రిలీజ్ సమయానికి టికెట్ రేట్లు కూడా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి.







