తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ఒకరు.ప్రస్తుతం ఆయన మోక్షజ్ఞతో ఒక సినిమాని, రిషబ్ శెట్టి తో ‘జై హనుమాన్’( Jai Hanuman Movie ) అనే సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్( Prabhas ) తో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలనే బిజీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.
కాబట్టి ప్రశాంత్ వర్మ కమిట్ అయిన సినిమాలను ముందుగా కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రభాస్ సినిమాని తెరకెక్కించాలని ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా మంచి కథతో రావడమే కాకుండా సరికొత్త మేకింగ్ తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట.మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ కి ప్రశాంత్ వర్మ కథను కూడా వినిపించారట.ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ప్రశాంత్ వర్మ ఇప్పుడు చేయాల్సిన సినిమాల గురించి పట్టించుకోకుండా ప్రబాస్ సినిమా మీద తన ఫోకస్ పెడుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఇక బాలయ్య బాబు లాంటి నటుడు సైతం తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయమని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.

కానీ ఆయన మాత్రం ఆ సినిమాని పక్కనపెట్టి మిగతా సినిమాల కోసం తిరుగుతుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.మరి మోక్షజ్ఞ( Mokshagna ) ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా లేదా అనే దానిమీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.