దుబాయ్ ట్రిప్.. డీజీపీ కూతురు రన్యా రావ్ కు దక్కిన కమిషన్ ఎంతో తెలుసా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రన్యా రావ్( Ranya Rao ) పేరు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. బంగారం స్మగ్లింగ్ కేసులో( gold smuggling case ) అడ్డంగా బుక్కైన రన్యా రావ్ పై చాలా ఆరోపణలు వినిపించాయి.

 Gold Smuggling Ranya Rao Commission Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

ఆమె డీజీపీ కూతురు( DGP’s daughter ) కావడంతో పాటు హీరోయిన్ కూడా కావడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు ఎక్కువగా మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే.అయితే ఆమె దుబాయ్ ట్రిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

కిలో బంగారం( Kilo gold ) అక్రమ రవాణా చేస్తే ఆమెకు 5 లక్షల రూపాయలు కమిషన్ గా దక్కేదట.ఈ విధంగా ఆమె భారీ స్థాయిలోనే సంపాదించారని సమాచారం అందుతోంది.

ఈ వివాదం అంతకంతకూ ముదురుతుండగా ఆమె వెనుక ఉన్న అసలు సూత్రధారి వేరే వ్యక్తి అని సమాచారం అందుతుండటం గమనార్హం.ఆమె పాపులారిటీ ఉన్న వ్యక్తి కావడంతో సులువుగా స్మగ్లింగ్ చేయించవచ్చని ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Telugu Airport, Dgps, Gold, Gold Ranya Rao, Kilo Gold, Ranya Rao-Movie

విమానాశ్రయంలో( airport ) ఉన్న కొందరు అధికారులు సైతం ఆమెకు సహకరించారని తెలుస్తోంది.ఈ కోణంలో సైతం విచారణ జరుగుతోంది.కమీషన్ కు అదనంగా ఆమె 12 లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలుస్తోంది.ఒక్క ట్రిప్ లో ఆమె 10 కేజీల కంటే ఎక్కువ మొత్తం బంగారం స్మగ్లింగ్ చేసేవారని సమాచారం అందుతోంది.

రన్యారావ్ బ్యాంక్ ఆకౌంట్లను సైతం అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Airport, Dgps, Gold, Gold Ranya Rao, Kilo Gold, Ranya Rao-Movie

బ్యాంక్ అకౌంట్ మొబైల్ ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.రన్యా రావ్ ఈ కేసు నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.రన్యా రావ్ ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు కావడం ఈ కేసులో ఒకింత సంచలనం అయింది.

రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.రన్యా రావ్ కెరీర్ ఈ వివాదం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube